విదేశీ పర్యటన ముగించుకుని సీఎం జగన్మోహన్ రెడ్డి కుటుంబ సమేతంగా శుక్రవారం రాష్ట్రానికి చేరుకున్నారు. లండన్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకున్న ఆయనకు మంత్రులు, వైసిపి ముఖ్య నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. సీఎం జగన్ కు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు.
సీఎం జగన్ కు స్వాగతం పలుకుతున్న మంత్రులు
విదేశీ పర్యటన ముగించుకుని సీఎం జగన్మోహన్ రెడ్డి కుటుంబ సమేతంగా శుక్రవారం రాష్ట్రానికి చేరుకున్నారు. లండన్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకున్న ఆయనకు మంత్రులు, వైసిపి ముఖ్య నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. సీఎం జగన్ కు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. ఇదిలా ఉంటే సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్ళిన తర్వాత రాష్ట్రంలో జరిగిన పరిణామాలు, పార్టీ నాయకులపై పెట్టిన కేసులు, కౌంటింగ్ రోజు అనుసరించాల్సిన వ్యూహాలపై ముఖ్య నాయకులతో శనివారం సీఎం భేటీ కానున్నారు. ఈ సందర్భంగా కౌంటింగ్ రోజు పార్టీ నాయకులు, ఏజెంట్లు తీసుకోవలసిన జాగ్రత్తలకు సంబంధించి కీలక సూచనలు ఆయన చేసే అవకాశం కనిపిస్తోంది.ఈ మేరకు రాష్ట్రంలోని పార్టీ ముఖ్య నాయకులకు ఇప్పటికే సమాచారం అందింది. సీఎం జగన్ నిర్వహించే సమీక్ష సమావేశానికి హాజరు కావాల్సిందిగా సమాచారాన్ని పంపించారు. శనివారం సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా వెలువడనున్న నేపథ్యంలో.. వీటికి సంబంధించిన చర్చ కూడా సమావేశంలో సాగే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలో రెండోసారి వైసిపి అధికారంలోకి వస్తుందని సీఎం జగన్ బలంగా చెబుతూ వస్తున్నారు.
అందుకు అనుగుణంగానే పలు సర్వే సంస్థలు ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఫలితాలకు సంబంధించిన ఒక స్పష్టమైన సమాచారాన్ని కూడా పార్టీ నాయకులకు సీఎం జగన్ ఈ సమావేశంలో చెప్పే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జిల్లాల వారీగా ఏఏ స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందన్న దానిపై సీఎం జగన్కు ఇప్పటికే అందిన ఒక రిపోర్టును కూడా ఈ సమావేశంలో బయటకు వెల్లడించే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సమావేశం శనివారం మధ్యాహ్నం జరిగే అవకాశం ఉంది.