ముగిసిన సీఎం జగన్ లండన్ పర్యటన.. రేపు రాష్ట్రానికి రాక

ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి రానున్నారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం ఈ నెల 17వ తేదీన సీఎం జగన్ భార్య భారతతో కలిసి లండన్ వెళ్లారు.

CM ys Jagan, ys bharathi

సీఎం జగన్ దంపతులు

ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి రానున్నారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం ఈ నెల 17వ తేదీన సీఎం జగన్ భార్య భారతతో కలిసి లండన్ వెళ్లారు. పర్యటన ముగించుకున్న సీఎం జగన్ ప్రత్యేక విమానంలో లండన్ నుంచి బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి శుక్రవారం ఉదయం చేరుకోనున్నారు. సుమారు రెండు నెలలపాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన సేదతీరే ఉద్దేశంతో కుటుంబంతో కలిసి లండన్ వెళ్లారు. అక్కడి నుంచే కుమార్తెలతో కలిసి ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ కు జగన్ వెళ్లారు. పర్యటన ముగించుకొని వస్తున్న సీఎం జగన్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి నేరుగా రోడ్డు మార్గంలో తాడేపల్లిలోని నివాసానికి వెళ్లనున్నారు. రాష్ట్రానికి వస్తున్న జగన్ కు స్వాగతం పలికేందుకు ఆ పార్టీ నాయకులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్