ఈ-ఆఫీస్ వ్యవహారంపై గవర్నర్ కు చంద్రబాబు లేఖ

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గురువారం గవర్నర్ అబ్దుల్ నజీర్ కు లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ ఆఫీస్ అప్ గ్రేడ్ వ్యవహారాల్ని నిలిపివేయాలంటూ చంద్రబాబు నాయుడు ఆ లేఖలో గవర్నర్ ను కోరారు.

నారా చంద్రబాబు నాయుడు
నారా చంద్రబాబు నాయుడు

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గురువారం గవర్నర్ అబ్దుల్ నజీర్ కు లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ ఆఫీస్ అప్ గ్రేడ్ వ్యవహారాల్ని నిలిపివేయాలంటూ చంద్రబాబు నాయుడు ఆ లేఖలో గవర్నర్ ను కోరారు. ఈ ఆఫీస్ మూసివేతపై అనేక అనుమానాలను వ్యక్తం చేసిన చంద్రబాబు.. కొత్త ప్రభుత్వం వస్తున్న వేల దాన్ని ఆపరేట్ చేయాల్సిన అవసరం లేదంటూ ఆ లేఖలో స్పష్టం చేశారు. ఈ ఆఫీస్ వ్యవహారంలో అక్రమాలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నెల 17 నుంచి 25 వరకు అప్ గ్రేడ్ పేరుతో ఈ ఆఫీస్ మూసివేతపై అనుమానాలను చంద్రబాబు వ్యక్తం చేశారు. పారదర్శకత పాటించని ఈ ప్రభుత్వంలో ఈ ఆఫీస్ వ్యవహారంలో అక్రమాలు జరిగే అవకాశం ఉందని ఆయన లేఖలో పేర్కొన్నారు.

ఈ-ఆఫీస్ వెర్షన్ ను అప్ గ్రేడ్ చేయడం వల్ల ఇబ్బందులు ఉంటాయన్నారు. అత్యవసరంగా చేపట్టిన ఈ విధానంపై అధికారులు, రాజకీయ పార్టీల్లో అనుమానాలు ఉన్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. ఐదేళ్లలో ప్రభుత్వం తీసుకునే ముఖ్యమైన నిర్ణయాలకు సంబంధించిన జీవోలను కూడా ప్రభుత్వం వెబ్సైట్లో పెట్టకుండా రహస్యంగా ఉంచుతోందని చంద్రబాబు ఆలేఖలో అనుమానం వ్యక్తం చేశారు. అడ్డగోలుగా విడుదల చేసిన జీవోలను ప్రభుత్వ పారదర్శకతను ప్రశ్నించిన వారిపై ప్రభుత్వం దాడి చేసిందని వివరించారు. ఇప్పటికే పలు రికార్డులు మాయం అయ్యాయని, దీనిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉన్న ఫిజికల్ డాక్యుమెంట్లు, డిజిటల్ డాక్యుమెంట్లు భద్రపరిచేలా చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు ఇవ్వాలని చంద్రబాబునాయుడు ఆ లేఖలో గవర్నర్ ను కోరారు.

వెబ్ స్టోరీస్