ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే జూన్ 4వ తేదీన పెద్ద ఎత్తున ప్రతీకార దాడులు జరిగే అవకాశం ఉందని ఇప్పటికే ఇంటెలిజెన్స్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అందుకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఇంటిలిజెన్స్ ఎన్నికల కమిషన్ కు నివేదిక సమర్పించింది.
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పెద్ద ఎత్తున గొడవలు జరిగిన విషయం తెలిసిందే. తిరుపతి, పల్నాడు, అనంతపురంలోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలను అదుపు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీస్ అధికారులపై ఈసీ చర్యలు తీసుకుంది. రాజకీయ పార్టీలకు చెందిన వారిని పోలీసులు అరెస్టు చేసి గొడవలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే జూన్ 4వ తేదీన పెద్ద ఎత్తున ప్రతీకార దాడులు జరిగే అవకాశం ఉందని ఇప్పటికే ఇంటెలిజెన్స్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అందుకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఇంటిలిజెన్స్ ఎన్నికల కమిషన్ కు నివేదిక సమర్పించింది. అయితే, తాజాగా ఇంటెలిజెన్స్ అధికారులు ఎన్నికల సంఘానికి మరో నివేదికను అందించారు. ఎన్నికల ఫలితాలు విడుదల అయ్యే జూన్ 4వ తేదీన కాకినాడ సిటీ, పిఠాపురం నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున గొడవలు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. కౌంటింగ్ కు ముందు, ఆ తరువాత హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం ఉందని ఇంటిలిజెన్స్ హెచ్చరించింది. ఆయా నియోజకవర్గాల్లోని ఏటిమొగ, దుమ్ములపేట, రామకృష్ణారావుపేట సహా పలు ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఇంటెలిజెన్స్ అధికారులు ఎన్నికల సంఘానికి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా గొడవలు చేసిన వ్యక్తులు, గొడవలను ప్రేరేపించిన వారిపై నిఘా ఉంచాలని నివేదికలో పేర్కొంది. తాజాగా ఇంటిలిజెన్స్ అందించిన నివేదిక రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా గోదావరి జిల్లాల్లో గొడవలు జరిగే అవకాశం ఉందని నివేదిక ఇవ్వడం ప్రస్తుతం ఈ ప్రాంత ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. ఇంటెలిజెన్స్ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. గొడవలకు, హింసాత్మక ఘటనలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు.