ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు నామినేషన్

ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా చింతకాయల అయ్యన్నపాత్రుడు నామినేషన్ వేశారు. ఆయన తరఫున కూటమి నేతలు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, పయ్యావుల కేశవ్, కింజారపు అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్ రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు.

ayyanna
రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేస్తున్న కూటమి నేతలు

ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా చింతకాయల అయ్యన్నపాత్రుడు నామినేషన్ వేశారు. ఆయన తరఫున కూటమి నేతలు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, పయ్యావుల కేశవ్, కింజారపు అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్ రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. అయ్యన్నపాత్రుడు మినహా ఎవరూ నామినేషన్ దాఖలు చేయకపోవటంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది. జనసేన, బీజేపీ నుంచి ఎవరూ నామినేషన్ వేయలేదు. వైసీపీకి పోటీ చేసే అంత బలం లేదు. దీంతో స్పీకర్‌గా అయ్యన్న ఎంపిక లాంఛనమే కానుంది. రేపు సభలో ఆయన పేరును ప్రకటించనున్నారు.

రఘురామకు మొండి చేయి

అసెంబ్లీ స్పీకర్ పదవి కోసం ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు తీవ్రంగా ప్రయత్నించారు. ఓ దశలో జగన్‌పై ప్రతీకారం తీర్చుకొనేందుకు రఘురామనే బెస్ట్ అని వార్తలు వచ్చాయి. రఘురామ కూడా.. తనను ప్రజలు స్పీకర్‌గా చూడాలనుకుంటున్నారని వెల్లడించారు. కానీ, సీఎం చంద్రబాబు పార్టీలో సీనియర్ నాయకుడు అయిన అయ్యన్న పాత్రుడివైపే మొగ్గు చూపారు. అయితే.. రఘురామను ఖాళీగా కూర్చోబెట్టొద్దని, ఆయనకు ఏదో ఒక పదవి ఇవ్వాలని అధిష్ఠానాన్ని టీడీపీ శ్రేణులు కోరుతున్నాయి. ఆయన ఖాళీగా ఉండటానికి ఇష్టపడరని, ఏదైనా కమిటీ చైర్మన్‌గా నియమించి.. పని చేయించాలని పేర్కొంటున్నాయి.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్