ఏపీ సీఎం జగన్‌పై దాడి కేసులో నిందితుడు సతీశ్ అరెస్టు.. ఎందుకు దాడి చేశారంటే..

మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా ఏపీ సీఎం జగన్‌పై దాడి కేసులో సతీశ్ అనే వ్యక్తిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. హత్యాయత్నం కేసులో సతీశ్ ఏ1గా ఉన్నాడు. ఈ రోజు అతడిని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.

ys jagan
ఏపీ సీఎం జగన్

విజయవాడ, ఈవార్తలు న్యూస్: మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా ఏపీ సీఎం జగన్‌పై దాడి కేసులో సతీశ్ అనే వ్యక్తిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. హత్యాయత్నం కేసులో సతీశ్ ఏ1గా ఉన్నాడు. ఈ రోజు అతడిని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. అనంతరం కేసుపై పోలీసులు మాట్లాడుతూ.. ప్రత్యక్ష సాక్షుల సమాచారంతో నిందితుడిని పట్టుకున్నట్లు వెల్లడించారు. 17న రాజరాజేశ్వరిపేటలో అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. సమయం చూసి జగన్‌పై దాడి చేశారని, దాడి కోసం కాంక్రీటు రాయిని ఉపయోగించారని వివరించారు. అదే సమయంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు కూడా గాయమైందని పోలీసులు తెలిపారు. దాడి వెనుక సీఎం జగన్‌ను చంపాలన్న ఉద్దేశం ఉందని చెప్పారు. ఏ2 నిందితుడి ప్రోద్భలంతోనే సతీశ్ ఈ దాడికి పాల్పడ్డాడని వెల్లడించారు.

కాగా, శనివారం విజయవాడలోని అజిత్ సింగ్ నగర్‌లో సీఎం జగన్‌పై రాయితో దాడికి పాల్పడ్డ విషయం తెలిసిందే. ఆ రాయి నేరుగా సీఎం జగన్  ఎడమ కంటి పైభాగంలో తాగడం గమనార్హం. అదే రాయి నేరుగా వెల్లంపల్లికి కూడా తాకడంతో ఆయనకు కూడా గాయమైంది. ప్రాథమిక చికిత్స తీసుకొన్న జగన్.. యాత్రను కొనసాగిస్తూనే, వెళ్లి విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు.

ఈ దాడి ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఏకంగా ఒక సీఎంపై దాడి జరగటాన్ని యావత్తు దేశం ఖండించింది. ప్రధాని మోదీ మొదలుకొని అన్ని పక్షాలు దాడిని తీవ్రంగా ఖండించాయి. కేంద్ర ఎన్నికల సంఘం భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ రాష్ట్ర అధికారులను వివరణ కోరింది. డీజీపీ, ఉన్నతస్థాయి అధికారులు ఏం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

వెబ్ స్టోరీస్