ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్‌పర్సన్‌గా రిటైర్డ్ ఐపీఎస్ ఏఆర్ అనురాధను నియమిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీచేశారు.
ఐపీఎస్ ఏఆర్ అనురాధ
అమరావతి, ఈవార్తలు : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్‌పర్సన్‌గా రిటైర్డ్ ఐపీఎస్ ఏఆర్ అనురాధను నియమిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీచేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఏపీపీఎస్సీ చైర్మన్‌గా నియమితులైన గౌతమ్ సవాంగ్ ఈ ఏడాది జూలై 4వ తేదీన తన పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఆ పదవి ఖాళీగానే ఉంది. తాజాగా, చైర్ పర్సన్‌గా ఏఆర్ అనురాధ నియమితులు కావడంతో ఉద్యోగ నియమక ప్రకటనలు జోరందుకోనున్నాయి. 2014-19లో టీడీపీ హయాంలో ఏపీ ఇంటెలిజెన్స్ అధిపతిగా పనిచేసిన అనురాధ.. డీజీ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంలోనూ సేవలు అందించారు. ఈమె 1987 బ్యాచ్ ఐపీఎస్ అధికారిణి. ఆమె భర్త నిమ్మగడ్డ సురేంద్రబాబు కూడా ఐపీఎస్సే.