ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లనున్నారు. జూలై 4న ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తో ఆయన సమావేశం కానున్నారు. విభజన హామీలు, ఇతర ఆర్థిక అంశాలపై వారితో చర్చించనున్నట్లు సమాచారం.
అమరావతి, ఈవార్తలు : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లనున్నారు. జూలై 4న ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తో ఆయన సమావేశం కానున్నారు. విభజన హామీలు, ఇతర ఆర్థిక అంశాలపై వారితో చర్చించనున్నట్లు సమాచారం. కేంద్రం బడ్జెట్ ప్రవేశ పెట్టనుండటంతో రాష్ట్రానికి సంబంధించి పలు ప్రతిపాదనలు చేసేందుకు, ఆయా అంశాలపై వారితో చర్చించనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి అధిక నిధులు కేటాయించాలని కోరనున్నట్లు సమాచారం. మరోవైపు, విభజన హామీలు, పెండింగ్ బకాయిలు, ఏపీకి అందాల్సిన నిధులు త్వరగా అందించాలని ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులను ఆయన కోరే అవకాశం ఉంది. ఈ భేటీపై స్పష్టత వస్తే.. దానికి అనుగుణంగా ఏపీ రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపట్టాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఏపీ సీఎం హోదాలో చంద్రబాబు తొలిసారి ఢిల్లీ వెళ్లనున్నారు. దీంతో ఆయన పర్యటనప రాజకీయవర్గాలు, ప్రజల్లో ఆసక్తి నెలకొంది. ఏపీకి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి? ఎన్ని నిధులు రాష్ట్రానికి వస్తాయి? అన్న చర్చ నడుస్తోంది. ఇప్పటికే బీహార్‌కు ప్రత్యేక హోదా కోరుతూ ఆ రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్ డిమాండ్ చేయగా, మరి.. ఏపీకి ప్రత్యేక హోదా కోసం కేంద్రాన్ని చంద్రబాబు డిమాండ్ చేస్తారా? అని చర్చించుకుంటున్నారు. ప్రత్యేక హోదా సాధిస్తే రాష్ట్రానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరనుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.