AP Assembly : ఏపీ అసెంబ్లీలో అరుదైన సన్నివేశం.. అసెంబ్లీ మెట్లకు మొక్కిన చంద్రబాబు

AP Assembly : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా అసెంబ్లీలో అరుదైన సన్నివేశం చోటుచేసుకుంది. అసెంబ్లీలోకి ఎంటర్ అవుతూ సీఎం చంద్రబాబునాయుడు అక్కడ ఉన్న మెట్లకు మొక్కి, లోపలికి వెళ్లారు.

ap assembly

పవన్ కల్యాణ్, చంద్రబాబు

అమరావతి, ఈవార్తలు : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా అసెంబ్లీలో అరుదైన సన్నివేశం చోటుచేసుకుంది. అసెంబ్లీలోకి ఎంటర్ అవుతూ సీఎం చంద్రబాబునాయుడు అక్కడ ఉన్న మెట్లకు మొక్కి, లోపలికి వెళ్లారు. శాసనసభా పక్షనేత కార్యాలయంలో వేద పండితులు ఆశీర్వాదం అందజేశారు. అనంతరం సభ ప్రారంభం అయ్యాక ఎమ్మెల్యేలంతా సభలో ప్రమాణం చేశారు. వీరితో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణం చేయించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తదితరులు ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతకుముందు అసెంబ్లీ వెనకాల గేటు నుంచి జగన్ ప్రాంగణం లోపలికి వచ్చారు. లోపలికి వచ్చినా, ముందుగా సభలోకి రాలేదు. తన ప్రమాణ స్వీకార సమయం వచ్చాకే సభలోకి అడుగుపెట్టారు. కాగా, రెండున్నరేళ్ల తర్వాత చంద్రబాబు అసెంబ్లీలో అడుగుపెట్టారు. తన సతీమణిని కించపరిచారన్న బాధతో ఆయన అసెంబ్లీకి రాలేదు. సీఎం అయ్యాకే సభలో అడుగుపెడతానని శపథం చేశారు. లేకపోతే తాను ఈ రాజకీయాలే చేయనని స్పష్టం చేశారు. అన్నట్టుగానే రెండున్నరేళ్ల తర్వాత ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు అసెంబ్లీలో అడుగుపెట్టారు.



సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్