ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కొత్త చీఫ్ సెక్రటరీ (సీఎస్)గా సీనియర్ ఐఏఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. 1987 బ్యాచ్‌కు చెందిన నీరభ్.. ప్రస్తుతం పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు.
ఐఏఎస్ ఆఫీసర్లు జవహర్ రెడ్డి, నీరభ్ కుమార్ ప్రసాద్
అమరావతి, ఈవార్తలు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కొత్త చీఫ్ సెక్రటరీ (సీఎస్)గా సీనియర్ ఐఏఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. 1987 బ్యాచ్‌కు చెందిన నీరభ్.. ప్రస్తుతం పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ప్రస్తుత సీఎస్ కేఎస్ జవహర్ రెడ్డి గురువారం సెలవుపై వెళ్లారు. దీంతో కొత్త సీఎస్‌ను ప్రభుత్వం నియమించింది. మరోవైపు, కొత్త సీఎస్‌ను నియమించడంతో జవహర్ రెడ్డిని బదిలీ చేసింది. ఈ రోజు ఉదయం టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడిని నీరభ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇదిలా ఉండగా, రాష్ట్రవ్యాప్తంగా ట్రాన్స్‌ఫర్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఏ శాఖలోనూ బదిలీలు చేపట్టవద్దని ప్రభుత్వం నుంచి అన్ని శాఖలకు ఆదేశాలు వెళ్లా్యి. అన్ని శాఖల్లోని ఫైళ్లు, కాంట్రాక్టర్లకు డబ్బు చెల్లింపులు కూడా నిలిపివేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.
ఇక, ఈ నెల 12వ తేదీన చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ వేడుకకు ఎన్డీయే ప్రధానిగా నరేంద్ర మోదీ, ఇతర ప్రముఖులు హాజరుకానున్నారు. ఈలోగానే ఏపీ ప్రభుత్వం కొత్త సీఎస్‌ను నియమించడం గమనార్హం. కొత్త సీఎస్ నియామకంతో మొదలైన ప్రక్రియ.. రాష్ట్రవ్యాప్తంగా ట్రాన్స్‌ఫర్లతో హోరెత్తిపోనుంది. చంద్రబాబు మార్కు పాలన కనిపించనుంది.