ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో ఈ నెల 18న కేబినెట్ సమావేశం నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం చంద్రబాబు నేతృత్వంలో తొలి కేబినెట్ సమావేశం జరుగనుంది.
ఏపీ సీఎం చంద్రబాబు
అమరావతి, ఈవార్తలు : ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో ఈ నెల 18న కేబినెట్ సమావేశం నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం చంద్రబాబు నేతృత్వంలో తొలి కేబినెట్ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై మంత్రివర్గం చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే పలు కీలక ఫైళ్లపై సీఎం చంద్రబాబు సంతకాలు చేశారు. మెగా డీఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పెన్షన్లు రూ.4 వేలకు పెంచుతూ, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, స్కిల్ సెన్సెస్‌పై చంద్రబాబు తొలి ఐదు సంతకాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ హామీలపై కేబినెట్ సమావేశంలో చర్చించే చాన్స్ ఉందని సమాచారం.
19 నుంచి అసెంబ్లీ సమావేశాలు?
కొత్త ప్రభుత్వంలో స్పీకర్ ఎన్నిక, ఎమ్మెల్యే ప్రమాణం చేయాల్సి ఉన్నందున.. ఈ నెల 19 ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆ సమావేశాల్లోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, బడ్జెట్ ఆమోదంపై నిర్ణయం తీసుకోనున్నారు.