ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి భారీస్థాయిలో ఐపీఎస్‌ల బదిలీలు చేపట్టింది. ఈసారి ఏకంగా 37 మంది అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రతీకాత్మక చిత్రం
IPS Transfers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి భారీస్థాయిలో ఐపీఎస్‌ల బదిలీలు చేపట్టింది. ఈసారి ఏకంగా 37 మంది అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో శ్రీకాకుళం జిల్లాకు ఎస్పీగా కేవీ మహేశ్వర్ రెడ్డిని బదిలీ చేసింది. ఆయనతో పాటు 37 మందికి స్థానచలనం కల్పించింది. అందులో శ్రీధర్, సునీల్, జగదీశ్, రఘువీరారెడ్డి, సత్తిబాబు, సిద్ధార్థ్ కౌశల్‌ను డీజీపీకి రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
బదిలీ అయిన ఐపీఎస్‌లు వీరే..
శ్రీకాకుళం జిల్లా - కేవీ మహేశ్వర్‌రెడ్డి
విజయనగరం - వకుల్ జిందాల్
అనకాపల్లి - ఎం దీపిక
సత్యసాయి జిల్లా - వీ రత్న
పార్వతీపురం మన్యం - ఎస్వీ మాధవరెడ్డి
కాకినాడ - విక్రాంత్ పాటిల్
గుంటూరు - ఎస్ సతీశ్ కుమార్
అల్లూరి జిల్లా - అమిత్ బర్దార్
విశాఖ సిటీ డిప్యూటీ కమిషనర్-1 - అజితా వేజెండ్ల
విశాఖ సిటీ డిప్యూటీ కమిషనర్-2 - తుహిన్ సిన్హా
తూర్పుగోదావరి - డీ నరసింహ కిషోర్
అన్నమయ్య జిల్లా - వీ విద్యాసాగర్ నాయుడు
కోనసీమ జిల్లా - బీ కృష్ణారావు
కృష్ణా ఎస్పీ - ఆర్ గంగాధర్‌రావు
పశ్చిమగోదావరి జిల్లా - అద్నాన్ నయీమ్ ఆస్మీ
ఏలూరు జిల్లా - కే ప్రతాప్ శివకిశోర్
పల్నాడు జిల్లా - కే శ్రీనివాసరావు
ఏపీఎస్పీ విజయనగరం బెటాలియన్ కమాండెంట్- మల్లికాగార్గ్
ప్రకాశం - ఏఆర్ .దామోదర్
కర్నూలు - జీ బిందుమాధవ్
నెల్లూరు జిల్లా - జీ కృష్ణకాంత్
నంద్యాల - అధిరాజ్‌సింగ్ రానా
కడప - వీ హర్షవర్ధన్ రాజు
అనంతపురం - కేవీ మురళీకృష్ణ