రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం జరిగిన గొడవలు నేపథ్యంలో ఎన్నికల సంఘం కౌంటింగ్ కు సంబంధించి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఈనెల నాలుగో తేదీని జరిగే ఎన్నికల కౌంటింగ్ కేంద్రానికి వచ్చే రాజకీయ పార్టీల ఏజెంట్లకు, ఎన్నికల అధికారులకు ఎన్నికల సంఘం కీలక సూచన చేసింది.
బ్రీత్ ఎనలైజర్
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం జరిగిన గొడవలు నేపథ్యంలో ఎన్నికల సంఘం కౌంటింగ్ కు సంబంధించి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఈనెల నాలుగో తేదీని జరిగే ఎన్నికల కౌంటింగ్ కేంద్రానికి వచ్చే రాజకీయ పార్టీల ఏజెంట్లకు, ఎన్నికల అధికారులకు ఎన్నికల సంఘం కీలక సూచన చేసింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా బ్రీత్ ఎనలైజర్ తో టెస్టు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. కౌంటింగ్ కేంద్రాలకు మద్యం సేవించి ఎవరు రాకూడదని, అలా వచ్చినట్లయితే ఈ టెస్ట్ ద్వారా తేలిపోతుందని ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు. కౌంటింగ్ కేంద్రం లోపలికి వెళ్లే ప్రతి ఒక్కరికి ఈ టెస్ట్ చేయనున్నట్లు వెల్లడించింది ఈసి. దీనివల్ల కౌంటింగ్ కేంద్రాల వద్ద లేని పోనీ గొడవలకు ఆస్కారం లేకుండా చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు. మద్యం సేవించి కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లే వారితో గొడవలు జరిగే అవకాశం ఉందని ఎన్నికల సంఘం అధికారులు భావించడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
భారీ బందోబస్తు ఏర్పాట్లు
కౌంటింగ్ కు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం జరిగిన గొడవలు నేపథ్యంలో రికార్డు స్థాయిలో కేంద్ర బలగాలను రాష్ట్రంలో ఎన్నికల సంఘం మోహరిస్తోంది. కౌంటింగ్ సందర్భంగా అల్లర్లు జరిగేందుకు అవకాశం ఉందని భావిస్తున్న అనేక ప్రాంతాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్డన్ సెర్చ్ ను పోలీసులు నిర్వహిస్తున్నారు. పల్నాడు, అనంతపురం, కడప వంటి ప్రాంతాల్లో పోలింగ్ రోజు, పోలింగ్ తర్వాత అనేక ఘటనలు జరిగాయి. అటువంటి ప్రాంతాల్లో ఈ అదనపు బలగాలను భారీ ఎత్తున మోహరిస్తున్నారు. కౌంటింగ్ రోజు హింస జరిగే అవకాశం ఉందని ఇంటిలిజెన్స్ హెచ్చరికలు నేపథ్యంలో ఈ స్థాయిలో ఎన్నికల సంఘం అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.