Sankranti | కోడి పందాలపై పోలీసుల డేగ కన్ను.. 20 వేల మందిపై కేసులు..

evarthalu
ప్రతీకాత్మక చిత్రం


||ప్రతీకాత్మక చిత్రం|| సంక్రాంతి పండగ అంటేనే గుర్తుకొచ్చేది కోడిపందేలు, జూదాలు. 15 రోజుల ముందు నుండే కోడిపందేలకు కోళ్లను సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ విషయంలో పండుగ సాంప్రదాయాన్ని అడ్డంగా పెట్టుకుని కోడి పందేలు,  జూదాలకు రెడీ అవుతున్న వారికి పోలీస్ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సంక్రాంతి పండుగ పేరుతో కోడి పందేలు, జూదాలు నిర్వహించిన వారిపై కఠిన చర్యలు తప్పవని అందరూ ఈ పండగను ఆనందంగా చేసుకునేలా తాము అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీనికోసం జిల్లాలోని అన్ని గ్రామాలకు వెళ్లి గ్రామస్తుల సహకారం తీసుకొని గ్రామంలో వాలంటీర్లను సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో పందేలకు బారులు ఏర్పాటు చేసే ప్రదేశాలను పరిశీలించడంతోపాటు ఆ పందేలు నిర్వహించే నిర్వాహకులతో పోలీసులు మాట్లాడడం జరిగింది. పందేలు జూదాలు నిర్వహించడంపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ముందుస్తు బైండోవర్‌ చేయడం, కోడి కత్తులు తయారీ, కట్టేవారిపై ప్రత్యేక నిఘా నిఘా వేసి చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే కోడి పందేల వల్ల కలిగే అనర్ధాలను కూడా ప్రచారం ద్వారా తెలియజేయడం జరిగింది. ఇప్పటికే పందేలు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లి నిఘా పెట్టి ఆ ప్రాంతాలను ట్రాక్టర్లతో దున్నించి ధ్వంసం చేయిస్తున్నారు. అలాగే ఇలాంటి చర్యలకు పాల్పడ్డ 20వేల మందికి పైగా కేసులు, కత్తులు తయారుచేసేవారిని 155 మంది గుర్తించి 50 కత్తులను సీజ్‌ చేసి కేసు నమోదు చేయడం జరిగిందని పోలీసులు తెలిపారు. పందేలు నిర్వహించే వారికి నోటీసులో కూడా జారీ చేయడం జరిగింది. 

రాష్ట్రంలో పశ్చిమ గోదావరి, ఏలూరు, తూర్పు గోదావరి, గుంటూరు, కోనసీమ, ఎన్టీఆర్, కృష్ణా జిల్ల, శ్రీకాళహస్తి, తొట్టంబేడు, బుచ్చినాయుడుకండ్రిగ, ఏర్పేడు, కేవీబీపురం, వరదయ్యపాళెం,పలమనేరు, పుంగనూరు, తమిళనాడులోని కృష్ణగిరి, సేలం, రెపల్లే,వేమూరు, పెనుమూడి, నిజాంపట్నం, పల్లెకూన, భీమవరం, కాళ్ల, యలమంచిలి, మొగల్తూరు, పెంటపాడు, తణుకు, పెనుగొండ, అత్తిలి, వీరవాసరం, పాలకొల్లు, పోడూరు, ఆకివీడు కోడి పందేలు వేయడానికి 20 నుండి 50 లక్షల వరకు పోటీ పడడానికి కూడా సిద్ధమవుతున్నారు.  పోలీసులు పందేలు నిర్వహించే నిర్వాహకులకు కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్