|| ప్రతీకాత్మక చిత్రం ||
ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ ఉద్యోగ పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి.గత సంవత్సరం నవంబర్ లో కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా, ఈ సంవత్సరం జనవరి 22 న పరీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పరీక్షకు 4,59,182 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ రోజు విడుదల చేసిన ఫలితాలలో 95,208 మంది అభ్యర్థులు పరీక్షలో అర్హత సాధించినట్లు పోలీస్ కానిస్టేబుల్ బోర్డ్ తెలిపింది. ఈ పరీక్ష ఫలితాలను తెలుసుకునేందుకు https://slprb.ap.gov.in క్లిక్ చేసి ఫలితాలను పొందవచ్చని బోర్డు తెలిపింది. పరీక్షకు సంబంధించిన ఓఎంఆర్ షీట్లు ఈరోజు ఉదయం 10 గంటల నుండి ఫిబ్రవరి 7వ తేదీ వరకు ఆన్ లైన్ లో అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఫిబ్రవరి 13 నుంచి ఫిబ్రవరి 20వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు రెండవ దశ పరీక్ష కు అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు బోర్డ్ తెలిపింది. రెండవ దశ అప్లై చేసుకునేందుకు సందేహాలు ఉంటే 9441450639, 9100203323 నంబర్లను సంప్రదించాలని బోర్డు ఛైర్మన్ వెల్లడించారు.