ananth ambani : ఘనంగా అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ సంగీత్ ఫంక్షన్

ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ సంగీత్ ఫంక్షన్ శుక్రవారం రాత్రి ముంబైలో ఘనంగా జరిగింది. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్లో జరిగిన ఈ సంగీత్ ఫంక్షన్ కు సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.

Anant Ambani, Radhika Merchant Sangeet

అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ సంగీత్ ఫంక్షన్


ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ సంగీత్ ఫంక్షన్ శుక్రవారం రాత్రి ముంబైలో ఘనంగా జరిగింది. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్లో జరిగిన ఈ సంగీత్ ఫంక్షన్ కు సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ఇప్పటికే రెండుసార్లు ఆనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల ఫ్రీ వెడ్డింగ్ వేడుకలను అట్టహాసంగా ముఖేష్ అంబానీ నిర్వహించారు. ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు కూడా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు దేశ విదేశాల నుంచి భారీగా హాజరయ్యారు. తాజాగా నిర్వహించిన సంగీత్ ఫంక్షన్ ను వైభవంగా ముఖేష్ అంబానీ నిర్వహించారు. ఈ వేడుకలకు హాజరైన ఎంతో మంది ప్రముఖులు సంగీత్ ను చూసి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ఈ నెల 12న ఆనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహ బంధంతో ఒకటి కానున్నారు. హిందూ సాంప్రదాయం ప్రకారం అనంత్, రాధిక వివాహం నిర్వహించేందుకు ఏర్పాటులో జరుగుతున్నాయి. ఇటీవలే ముంబైలో 50 వేద జంటలకు అంబానీ కుటుంబం సామూహిక వివాహాలను జరిపించింది కొత్త జంటలకు నగదు బహుమతితోపాటు కానుకలను ఇచ్చి పెద్ద మనషుతో ఆశీర్వదించారు. 

హాజరైన పలువురు ప్రముఖులు 

దేశంలోనే నెంబర్ వన్ కుబేరుడు, ప్రపంచ సంపన్నుల్లో ఒకరు అయిన ముఖేష్ అంబానీ తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహ వేడుకలను కనీ విని ఎరుగని రీతిలో నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు ప్రీ వెడ్డింగ్ వేడుకలను నిర్వహించారు. తాజాగా నిర్వహించిన సంగీత్ ఫంక్షన్ కు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. రాజకీయ, సినీ, క్రికెట్, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు ఈ సంగీత్ కు హాజరై కాబోయే జంటను ఆశీర్వదించారు. శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు ఈ సంగీత్ జరిగింది. ఈ సంగీత్ లో విభిన్న రకాలతో కూడిన వంటకాలు ఆయా రంగాలకు చెందిన ప్రముఖులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్