ప్రీమియం ఫీచర్లతో అప్పో ఫోన్‌.. లుక్‌ చూస్తే అదిరిపోవాల్సిందే.!

OPPO నుంచి సరికొత్త స్మార్ట్‌ ఫోన్‌ మార్కెట్‌లోకి విడుదలైంది. ఈ ఫోన్‌లోని ఫీచర్లు వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. భారత్‌లో తన కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ అయిన OPPO A5 Pro 5Gను అధికారికంగా విడుదల చేసింది. ఈ ఫోన్‌ను దేశంలో వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని డిజైన్‌ చేశారు. ఇది 6.67 అంగుళాల HD ప్లస్‌ LCD స్ర్కీన్‌ను 120 HJ రిప్రెష్‌ రేట్‌తో అందిస్తుంది. అలాగే, ఈ ఫోన్‌కు 360 ఆర్మర్‌ బాడీ కలిగి ఉంది. ఇది అత్యంత క్లిష్టమైన వాతావరణ పరిస్థితులను తట్టుకోగలదు. 14 మిలిటరీ గ్రేడ్‌ పరీక్షల్లో ఈ ఫోన్‌ పాస్‌ అయింది. ఇందులో బయానిక్‌ కుషనింగ్‌ ఉండడంతో ఇది లోపలి భాగాలను ఎయిర్‌ బ్యాగ్‌లా కాపాడుతుంది.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

OPPO నుంచి సరికొత్త స్మార్ట్‌ ఫోన్‌ మార్కెట్‌లోకి విడుదలైంది. ఈ ఫోన్‌లోని ఫీచర్లు వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. భారత్‌లో తన కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ అయిన OPPO A5 Pro 5Gను అధికారికంగా విడుదల చేసింది. ఈ ఫోన్‌ను దేశంలో వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని డిజైన్‌ చేశారు. ఇది 6.67 అంగుళాల HD ప్లస్‌ LCD స్ర్కీన్‌ను 120 HJ రిప్రెష్‌ రేట్‌తో అందిస్తుంది. అలాగే, ఈ ఫోన్‌కు 360 ఆర్మర్‌ బాడీ కలిగి ఉంది. ఇది అత్యంత క్లిష్టమైన వాతావరణ పరిస్థితులను తట్టుకోగలదు. 14 మిలిటరీ గ్రేడ్‌ పరీక్షల్లో ఈ ఫోన్‌ పాస్‌ అయింది. ఇందులో బయానిక్‌ కుషనింగ్‌ ఉండడంతో ఇది లోపలి భాగాలను ఎయిర్‌ బ్యాగ్‌లా కాపాడుతుంది. అల్యూమినియం మదర్‌ బోర్డ్‌ కవర్‌, సాధారణ గ్లాస్‌తో పోలిస్తే 160 శాతం ఎక్కువ షాటర్‌ రెసిస్టెంట్‌ గ్లాస్‌తో ఇది వస్తుంది. ఈ ఫోన్‌కు IP66, IP68, IP69 సర్టిఫికేషన్లు ఉన్నాయి. అంటే ఇది దమ్ము, దూళి, నీటిలోనూ పూర్తి భద్రతతో పని చేస్తుంది. టీ, కాఫీ, పాలు, సోడా వంటి 18 రకాల ద్రవాల స్పిల్స్‌ను కూడా తట్టుకోగలదు. OPPO A5 Pro 5Gలో కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 7i గ్లాస్‌ ఉన్న 6.67 అంగుళాల హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే ఉంది.

ఇది 1000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. ఫోన్‌ మీడియాటెక్‌ డైమిన్సిటీ 6300 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. 8GB RAM, 128 GB/256 GB స్టోరేజ్‌  వేరియంట్లలో ఈ ఫోన్‌ లభ్యమవుతుంది. ఇక ఫొటోగ్రఫీ కోసం ఇందులో 50 MP ప్రధాన కెమెరా, 2 MP మోనోక్రోమ్‌ కెమెరా కలిపి డ్యూయల్‌ కెమెరా సెటప్‌తో వస్తుంది. సెల్ఫీలు తీసుకునేందుకు 8 MP ఫ్రంట్‌ కెమెరా ఉంది. ఈ ఫోన్‌లో 5800 Mah పెద్ద బ్యాటరీ ఉంది. ఇది 45W SUPER VOOC ఫాస్ట్‌ చార్జింగ్‌కు మద్ధతిస్తుంది. ఇక ఇతర ఫీచర్ల విషయానికి వస్తే సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌, ఆండ్రాయిడ్‌ 15పై కలర్‌ OS 15, డ్యూయల్‌ 4G వోల్టే, బ్లూట్లూత్‌ 5.3, wi-fi 5, USB టైపు C వంటివి ఉన్నాయి. OPPO A5 PRO 5G ఫోన్‌ ఫీథెర్‌ బ్లూ, మోచన్‌ బ్రౌన్‌ రంగుల్లో లభిస్తుంది. ఇక ఈ ఫోన్స్‌ 8GB Plus 128 GB వేరియంట్‌ ధర రూ.17,999 కాగా, 8GB ప్లస్‌ 256 GB వేరియంట్‌ ధర రూ.19,999గా ఉంది. ఈ ఫోన్‌ను అమెజాన్‌, ప్లిప్‌కార్ట్‌, ఒప్పో స్టోర్‌, ప్రధాన రిటైల్‌ అవుట్‌లెట్లు ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇక లాంచ్‌ ఆఫర్ల కింద ఎస్‌బీఐ, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఫైనాన్షియల్‌, ఫెడరల్‌ బ్యాంకు, డీబీఎస్‌ క్రెడిట్‌ కార్డులపై పది ఇన్‌స్టంట్‌ క్యాష్‌బ్యాక్‌ గరిష్టంగా రూ.1500 లభిస్తుంది. ఆరు నెలలపాటు నో కాస్ట్‌ ఈఎంఐ, డౌన్‌పేమెంట్‌ లేకుండా కన్జ్యూమర్‌ లోన్స్‌, ప్రముఖ ఫైనాన్స్‌ భాగస్వాములతో జీరో డౌన్‌ పేమెంట్‌ స్కీమ్‌ లాంటి పలు ఆఫర్లు అందుతున్నాయి.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్