మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం పై డ్రోన్ ఎగిరిన వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. డ్రోన్ తిరుగుతుండడంపై జనసేన నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై అనేక అనుమానాలు ఉన్నట్లు పోలీసులకు జనసేన నాయకులు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసుపై లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు కీలక అంశాన్ని నిర్ధారించారు. జనసేన పార్టీ కార్యాలయంపై తిరిగిన డ్రోన్ ప్రభుత్వానిదేనిని తేల్చారు.
ప్రతీకాత్మక చిత్రం
మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం పై డ్రోన్ ఎగిరిన వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. డ్రోన్ తిరుగుతుండడంపై జనసేన నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై అనేక అనుమానాలు ఉన్నట్లు పోలీసులకు జనసేన నాయకులు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసుపై లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు కీలక అంశాన్ని నిర్ధారించారు. జనసేన పార్టీ కార్యాలయంపై తిరిగిన డ్రోన్ ప్రభుత్వానిదేనిని తేల్చారు. ఏపీ ఫైబర్ నెట్ సంస్థకు చెందిన డ్రోన్ గా పోలీసులు గుర్తించారు. ఈ సంస్థ నిర్వహిస్తున్న సర్వేలో భాగంగానే కార్యాలయంపై డ్రోన్ ఎగిరినట్టుగా పోలీసులు స్పష్టం చేశారు. ట్రాఫిక్, పారిశుద్ధ్య కాలువల నిర్వహణ, రహదారుల స్థితిగతులపై ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో అధ్యయనం చేస్తుండగా పలు రకాల సర్వేలకు డ్రోన్లను వినియోగిస్తున్నారు. ఈ క్రమంలోనే జనసేన పార్టీ కార్యాలయం పైన ఈ డ్రోన్ ఎగిరింది. అయితే దీనిపై అనుమానాలను వ్యక్తం చేస్తూ జనసేన నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. విచారణ అనంతరం ఈ విషయాన్ని పోలీసులు నిర్ధారించారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భద్రతకు సంబంధించి ప్రతి అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు డిజిపి ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ మన్యం ప్రాంతంలో పర్యటించిన సందర్భంగా నకిలీ ఐపీఎస్ అధికారి పట్టుబడిన ఘటనలో పోలీస్ శాఖ వైఫల్యం లేదని పేర్కొన్నారు.
అసలు ఏం జరిగిందంటే.?
మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంపై గడిచిన కొద్దిరోజులుగా డ్రోన్ ఎగురుతోంది. అనేకమార్లు పార్టీ కార్యాలయంపైకి డ్రోన్ వస్తుండడం పట్ల జనసేన నాయకులకు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. వెంటనే అప్రమత్తమైన జనసేన నాయకులు పోలీసులకు డ్రోన్ ఎగురుతున్న విషయాన్ని తెలియజేశారు. దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు విచారించి పూర్తిస్థాయిలో నివేదిక ఇవ్వాలని గుంటూరు జిల్లా పోలీసులకు ఆదేశించారు. ఈ క్రమంలోనే శాంతి భద్రతల అదనపు ఎస్పి రవికుమార్ ఆధ్వర్యంలో నార్త్ డిఎస్పి మురళి కృష్ణ, మంగళగిరి సీఐ వినోద్ ఘటన జరిగిన రోజునే జనసేన కార్యాలయంలోని సిబ్బంది నుంచి వివరాలను సేకరించారు. రెండు రోజులపాటు లోతైన దర్యాప్తు అనంతరం అది ప్రభుత్వానికి చెందిన డ్రోన్ గా నిర్ధారించారు. ఇదే విషయాన్ని జనసేన కార్యాలయ అధికారులకు తెలియజేశారు. దీంతో జనసేన నాయకుల అనుమానాలకు పడినట్లు అయింది.