బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు స్మగ్లర్లు వినూత్న పంథాలో ముందుకు వెళ్తున్నారు. తాజాగా పోలీసులకు తెలియకుండా బంగారాన్ని గుట్టు చప్పుడు కాకుండా స్మగ్లింగ్ చేసిన ఓ వ్యక్తిని అరెస్టు చేసిన ఉదంతం పోలీసులను కూడా షాక్ కు గురి చేసింది. చెన్నై ఎయిర్ పోర్ట్ లోని ఒక షాపును లీజుకు తీసుకొని విదేశాల నుంచి ఆక్రమంగా వచ్చే బంగారాన్ని సిలికాన్ బాల్స్ రూపంలో లోకి మార్చి ఆ తర్వాత వాటిని ప్లాన్ ప్రకారం ఎయిర్ పోర్టు దాటించిన యూట్యూబర్ ఏకంగా రెండు నెలల్లోనే రూ.2.5 కోట్లు ఆర్జించినట్టు పోలీసులు విచారణలో తేలింది.
అక్రమంగా తరలిస్తున్న బంగారం
బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు స్మగ్లర్లు వినూత్న పంథాలో ముందుకు వెళ్తున్నారు. తాజాగా పోలీసులకు తెలియకుండా బంగారాన్ని గుట్టు చప్పుడు కాకుండా స్మగ్లింగ్ చేసిన ఓ వ్యక్తిని అరెస్టు చేసిన ఉదంతం పోలీసులను కూడా షాక్ కు గురి చేసింది. చెన్నై ఎయిర్ పోర్ట్ లోని ఒక షాపును లీజుకు తీసుకొని విదేశాల నుంచి ఆక్రమంగా వచ్చే బంగారాన్ని సిలికాన్ బాల్స్ రూపంలో లోకి మార్చి ఆ తర్వాత వాటిని ప్లాన్ ప్రకారం ఎయిర్ పోర్టు దాటించిన యూట్యూబర్ ఏకంగా రెండు నెలల్లోనే రూ.2.5 కోట్లు ఆర్జించినట్టు పోలీసులు విచారణలో తేలింది. ఈ రెండు నెలల్లో రూ.167 కోట్ల విలువైన 267 కేజీల బంగారాన్ని స్మగ్లింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. చెన్నై విమానాశ్రయంలోనే ఎయిర్ హబ్ కేంద్రంగా ఈ దందా సాగగా, ఈ స్మగ్లింగ్ సూత్రధారి చెన్నై నగరానికి చెందిన యూట్యూబర్ షబ్బీర్ అలీగా పోలీసులు గుర్తించి ఇప్పటికే అరెస్టు చేశారు. చెన్నై విమానాశ్రయంలో ఎయిర్ హబ్ పేరుతో ఒక షాపును లీజుకు తీసుకున్న అలీ.. మల ద్వారంలో బంగారాన్ని దాచిపెట్టి కస్టం అధికారులు కంటపడకుండా కొంతమంది యువకులతో స్మగ్లింగ్ చేయించినట్లు వెల్లడించాడు.
షాపింగ్ బాయ్స్ పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ ను నడిపిన అలీ ఎయిర్ హబ్ పేరుతో విమానాశ్రయంలో షాపును రూ.70 లక్షల కట్టి లీజుకు తీసుకున్నాడు. విదేశాల నుంచి అక్రమంగా వచ్చే బంగారాన్ని సిలికాన్ బాల్స్ రూపంలో తరలించేందుకు ఏడుగురు ఉద్యోగులను నియమించుకున్నాడు. ఏకకాలంలో ఒకటి నుంచి మూడు సిలికాన్ బాల్స్ ను మల ద్వారంలో పెట్టుకొని గంటసేపు కూర్చున్న ఎలాంటి నొప్పి రాకుండా ఉండేలా వారికి కఠిన శిక్షణ కూడా ఇప్పించాడు. అలా కస్టం అధికారులు కళ్ళు గప్పి బంగారంతో కూడిన సిలికాన్ బాల్స్ ను ఎయిర్పోర్ట్ నుంచి దాటించే వారికి అదనంగా రూ.5000 బహుమతిగా ఇచ్చేవాడు. స్మగ్లింగ్ చేయాల్సిన ప్రతిసారి పది రోజులు ముందు నుంచి దుకాణంలో సిబ్బందితో ప్రాక్టీస్ చేయించేవాడు. విదేశాల నుంచి విమానంలో అక్రమంగా బంగారం తీసుకొచ్చిన క్యారియర్ల నుంచి ఈ ఉద్యోగుల్లో ఒకరు ఆ బంగారాన్ని తీసుకుని దాన్ని సిలికాన్ బాల్స్ గా మార్చి మల ద్వారంలో పెట్టుకొని కస్టం అధికారులకు చిక్కకుండా విమానాశ్రయం నుంచి బయటికి వచ్చేవారు. ఆ తర్వాత ఆ బాల్స్ ను చేరాల్సిన చోటుకు ముఠాలోని ఇతర సభ్యులు చేర్చేవారు. ఈ అక్రమ రవాణా ద్వారా రెండు నెలల్లో యూట్యూబర్ ఏకంగా 2.5 కోట్లు అర్జించినట్లు విచారణలో వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో మరింత మంది ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారి కోసం ప్రస్తుతం విచారణ సాగుతోంది.