జనవరి 3న చట్టాలపై అవగాహన సదస్సు: అమ్మ యోగాశ్రమం సొసైటీ

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||రియల్ ఎస్టేట్ చట్టంపై అవగాహన సదస్సు||

(ఈవార్తలు, రంగారెడ్డి ప్రతినిధి, అక్కినేపల్లి పురుషోత్తమరావు)

అమ్మ యోగాశ్రమం సొసైటీ ఆధ్వర్యంలో ఈ నెల 3వ తేదీ (బుధవారం) మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు రియల్ ఎస్టేట్, ఇతర చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు. మానవ హక్కులు, ఉమెన్ రైట్స్, వినియోగదారుల హక్కులు, పర్యావరణ పరిరక్షణ, మానవ అక్రమ రవాణా చట్టం, బాల్యవివాహాల నిషేధ చట్టం, బాల కార్మిక వ్యవస్థ రద్దు చట్టం, ఆన్లైన్ మోసాలు, సైబర్ నేరాలు, తెలంగాణ రియల్ ఎస్టేట్ అథారిటీ చట్టం, బాలల హక్కుల చట్టాలపైనా అవగాహన కార్యక్రమం ఉంటుంది. ఈ చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన ఉండాలని, అందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అమ్మయోగాశ్రమం సొసైటీ చైర్మన్ నన్నక సీత తెలిపారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా డాక్టర్ బొడ్డపాటి దాసు, ముఖ్యఅతిథిగా హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ తెలంగాణ స్టేట్ కన్వీనర్ డాక్టర్ ఏఎస్ శ్రీనివాస్, గౌరవ అతిథిగా ఎనుముల రుక్మిణి హాజరవుతారని వెల్లడించారు. ప్రజలు ఈ అవగాహన సదస్సులో అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్