అల్లు అర్జున్ పై అమితాబ్ ప్రశంసల జల్లు.. బన్నీకి వీరాభిమానిని అంటూ వ్యాఖ్య

పుష్ప -2 చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ కి సంబంధించి బాలీవుడ్ అగ్ర నటుడు అమితాబ్ బచ్చన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పుష్ప-2 ప్రీమియర్ షో విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందిన వ్యవహారంలో ప్రస్తుతం అల్లు అర్జున్ కొన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. ఈ కేసులో జైలుకు వెళ్లి కూడా అల్లు అర్జున్ వచ్చాడు. అన్ని రకాలుగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న అల్లు అర్జున్ కు సంబంధించిన విషయంలో అమితాబ్ బచ్చన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Amitabh Bachchan, Allu Arjun

అమితాబ్ బచ్చన్, అల్లు అర్జున్ 

పుష్ప -2 చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ కి సంబంధించి బాలీవుడ్ అగ్ర నటుడు అమితాబ్ బచ్చన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పుష్ప-2 ప్రీమియర్ షో విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందిన వ్యవహారంలో ప్రస్తుతం అల్లు అర్జున్ కొన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. ఈ కేసులో జైలుకు వెళ్లి కూడా అల్లు అర్జున్ వచ్చాడు. అన్ని రకాలుగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న అల్లు అర్జున్ కు సంబంధించిన విషయంలో అమితాబ్ బచ్చన్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలోనూ కొన్నిసార్లు అల్లు అర్జున్ ను ప్రశంసించిన అమితాబ్.. తాజాగా మరోసారి ప్రశంసల జల్లు కురిపించారు. అల్లు అర్జున్ కు తాను వీరాభిమానిని అంటూ పేర్కొన్నారు. బన్నీ గొప్ప ప్రతిభావంతుడని పేర్కొన్నారు. కౌన్ బనేగా కరోడ్పతి లో ఒక కంటెస్టెంట్ తో అల్లు అర్జున్ గురించి అమితాబ్ బచ్చన్ మాట్లాడారు. అమితాబ్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కౌన్ భనేగా కరోడ్పతి ప్రస్తుతం 16వ సీజన్ నడుస్తోంది. ఈ ఎపిసోడ్ లో భాగంగా కలకత్తాకు చెందిన ఒక గృహిణి కంటెస్టెంట్ గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సదరు మహిళ మాట్లాడుతూ తనకు అల్లు అర్జున్, అమితాబ్ ఇద్దరూ ఇష్టమని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన బిగ్ బి అల్లు అర్జున్ తనకు వచ్చిన గుర్తింపులన్నింటికీ పూర్తి అర్హుడంటూ పేర్కొన్నారు. తాను కూడా అతనికి వీరాభిమానినని వెల్లడించారు.

ఇటీవల బన్నీ నటించిన పుష్ప ది రూల్ విడుదలై మంచి విజయం సాధించిన నేపథ్యంలో తాజాగా బిగ్బి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. 'మీరు ఇంకా సినిమాను చూడకపోతే వెంటనే చూడండి. అతడు గొప్ప ప్రతిభావంతుడు. అతడితో తనను పోల్చవద్దు' అని అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. దీనికి సదరు కంటెస్టెంట్ స్పందిస్తూ కొన్ని సన్నివేశాలు మీ ఇద్దరి మేనరిజం ఒకేలా ఉంటుందని పేర్కొన్నారు. ఈ షో వల్ల మిమ్మల్ని కలిసానని, ఏదో ఒక రోజు అల్లు అర్జున్ ను చూస్తే తన కళ నెరవేరుతుందని ఆనందాన్ని వ్యక్తం చేస్తూ మాట్లాడారు సదరు కాంటెస్టెంట్. ఇకపోతే పుష్ప-2 ప్రచారంలో భాగంగా ముంబైలో నిర్వహించిన ఒక మీడియా సమావేశంలో బన్నీ మాట్లాడుతూ అమితాబ్ అంటే తనకు ఎంతో ఇష్టమన్నారు. ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో స్టార్ గా ఉన్నారని, ఎంతోమంది నటీనటులకు ఆయన స్ఫూర్తి అని పేర్కొన్నారు. అమితాబ్ సినిమాలు చూస్తూ పెరిగానన్నారు. ఆయన స్ఫూర్తితోనే తాను ముందుకు వెళుతున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియోను గతంలో అమితాబ్ షేర్ చేశారు. అల్లు అర్జున్ పనితీరుకు తాను అభిమానిని అంటూ పోస్ట్ పెట్టారు  ఎన్నో మంచి విజయాలు అందుకోవాలని కోరారు. దీనికి బన్నీ రిప్లై పెడుతూ..  'మీరు మా సూపర్ హీరో. మీ నుంచి ఇలాంటి ప్రశంసలు నమ్మలేకపోతున్న. నాపై మీకున్న ప్రేమకు ధన్యవాదాలు' అంటూ వ్యాఖ్యానించారు. తాజాగా కౌన్ బనేగా కరోడ్పతి ప్రోగ్రామ్ లో అల్లు అర్జున్ ను మరోసారి ప్రశంసిస్తూ అమితాబ్ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్