అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దూకుడు.. మాట వినని దేశాలపై చర్యలు

అమెరికా అధ్యక్షుడుగా కొద్ది రోజుల కిందటే బాధ్యతలు స్వీకరించిన డోనాల్డ్ ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. కీలక నిర్ణయాలను అత్యంత వేగంగా తీసుకుంటూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. ఈ క్రమంలోనే తన మాట వినని దేశాలపైన ట్రంప్ చర్యలు చేపడుతున్నారు. అమెరికాలో ఉంటున్న అక్రమ వలసదారులను తీసుకెళ్లిన విమానాలను విప్పి పంపినందుకు కొలంబియాపై ట్రంప్ తాజాగా కొరడా ఝులిపించారు. త్వరలోనే ఆ దేశంపై భారీ దిగుమతి సుంకాలతోపాటు ట్రావెల్ బ్యాన్ లాంటి ఆంక్షలు అమలు చేయనున్నట్లు ట్రంప్ ప్రకటించారు.

Donald Trump

డోనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్షుడుగా కొద్ది రోజుల కిందటే బాధ్యతలు స్వీకరించిన డోనాల్డ్ ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. కీలక నిర్ణయాలను అత్యంత వేగంగా తీసుకుంటూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. ఈ క్రమంలోనే తన మాట వినని దేశాలపైన ట్రంప్ చర్యలు చేపడుతున్నారు. అమెరికాలో ఉంటున్న అక్రమ వలసదారులను తీసుకెళ్లిన విమానాలను విప్పి పంపినందుకు కొలంబియాపై ట్రంప్ తాజాగా కొరడా ఝులిపించారు. త్వరలోనే ఆ దేశంపై భారీ దిగుమతి సుంకాలతోపాటు ట్రావెల్ బ్యాన్ లాంటి ఆంక్షలు అమలు చేయనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతా ట్రూత్ సోషల్ లో ఒక పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్టు ప్రపంచవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టిస్తోంది. కొలంబియా అధ్యక్షుడు పెట్రో అమెరికా జాతీయ భద్రతను ప్రమాదంలో పడేసాడని, ఇందుకే కొలంబియా పై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చానంటూ ట్రంప్ పోస్టులో రాసుకు వచ్చారు. కొలంబియా నుంచి దిగిన వస్తువులపై ఎప్పటికీ ఇప్పుడు 25 శాతం టారిఫ్ విధిస్తామని స్పష్టం చేశారు.

ఇది రానున్న వారం రోజుల్లో 50 శాతానికి పెరుగుతుందని వెల్లడించారు. ఈ నిర్ణయంతో ఒక్కసారిగా ప్రపంచ దేశాలు షాక్ కు గురయ్యాయి. రానున్న రోజుల్లో ఇటువంటి కీలక నిర్ణయాలు తీసుకునేందుకు వెనుకాడబోనని ట్రంప్ ఈ నిర్ణయం ద్వారా మరోసారి స్పష్టం చేసినట్లు అయింది. కొలంబియా నుంచి అమెరికాకు రావడం పై ట్రావెల్ బ్యాన్, వీటితోపాటు ఆర్థిక ఆంక్షలు ఉంటాయని ట్రంప్ వెల్లడించారు. కాగా ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత అమెరికాలో అక్రమంగా ఉంటున్న వలసదారులను వారి దేశాలకు పంపేస్తున్న విషయం తెలిసిందే. అయితే వలసదారులను నేరస్తులుగా చిత్రీకరిస్తూ వారిని మిలటరీ వాహనాల్లో పంపడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని కొలంబియా అధ్యక్షుడు పెట్రో ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. తమ దేశానికి చెందిన వారికి గౌరవం ఇస్తూనే.. పౌరు విమానాల్లో పంపితే తాము స్వాగతిస్తామని పేర్కొన్నారు. గతవారం మెక్సికో కూడా కొలంబియా సలహాలోనే ట్రంపు వలసదారులతో పంపించిన మిలిటరీ హనాలను తిప్పి పంపింది. మరి ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయంపై కొలంబియా ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. మిగిలిన దేశాలు ఈ తరహా చర్యలను ఎలా పరిగణలోకి తీసుకుంటాయి అన్నది కూడా ఆసక్తిగా మారింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్