బంగ్లాదేశ్ లో చెలరేగిన చిచ్చు వెనుక అమెరికా హస్తం ఉందా.? అంటే అవునన్నా సమాధానమే రాజకీయ, అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుల నుంచి వస్తోంది. బంగ్లాదేశ్ లోని ఒక ద్వీపం కోసం అమెరికా చేసిన పన్నాగంగా పలువురు పేర్కొంటున్నారు. బంగాళాఖాతంలో మూడు చదరపు కిలోమీటర్లు ఉండే ఒక అందమైన ద్వీపం కావాలంటూ అమెరికా గతంలో కోరింది. ఎంతో వైవిధ్యం, అంతకు మించిన ప్రకృతి సౌందర్యం ప్రత్యేకించి సైనిక పరంగా అత్యంత వ్యూహాత్మక ప్రాంతం కావడంతో అమెరికా కన్ను దీనిపై పడింది.
బంగ్లాదేశ్ లో ఆందోళన చేస్తున్న ఆందోళనకారులు
బంగ్లాదేశ్ లో చెలరేగిన చిచ్చు వెనుక అమెరికా హస్తం ఉందా.? అంటే అవునన్నా సమాధానమే రాజకీయ, అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుల నుంచి వస్తోంది. బంగ్లాదేశ్ లోని ఒక ద్వీపం కోసం అమెరికా చేసిన పన్నాగంగా పలువురు పేర్కొంటున్నారు. బంగాళాఖాతంలో మూడు చదరపు కిలోమీటర్లు ఉండే ఒక అందమైన ద్వీపం కావాలంటూ అమెరికా గతంలో కోరింది. ఎంతో వైవిధ్యం, అంతకు మించిన ప్రకృతి సౌందర్యం ప్రత్యేకించి సైనిక పరంగా అత్యంత వ్యూహాత్మక ప్రాంతం కావడంతో అమెరికా కన్ను దీనిపై పడింది. ఇక్కడి సైనిక స్థావరం ఏర్పాటు చేస్తామంటూ బంగ్లాదేశ్ ను అమెరికా గతంలో కోరింది. అయితే, బంగ్లా దేశాధినేత హసీనా ఇందుకు అంగీకరించలేదు. అమెరికా ప్రతిపాదనను కాదన్నందుకు ఆమెపై అగ్రరాజ్యం పగబట్టింది. పదవి నుంచి దిగిపోయే వరకు నిద్రపోలేదు. ఇదంతా బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పదవీచ్యతి వెనుక ఉన్న నేపథ్యం అంటూ తాజాగా కథనాలు వస్తున్నాయి. హసీనా సెయింట్ మార్టిన్స్ లో వైమానిక స్థావరానికి అనుమతి ఇస్తే తిరిగి తేలిగ్గా పదవిలోకి వచ్చేలా చూస్తామని ఓ తెల్ల వ్యక్తి తనకు ప్రతిపాదించినట్టు జనవరిలో జరిగిన ఎన్నికలకు ముందు చెప్పిన విషయాన్ని కొద్దిరోజుల కిందట వెల్లడించారు. అమెరికా కోరినట్టు చేసి ఉంటే తాను దిగిపోయే పరిస్థితి వచ్చేది కాదంటూ ఇటీవల వ్యాఖ్యానించినట్లు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా వస్తున్న కథనాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
సెయింట్ మార్టిన్స్ ద్వీపం బంగ్లాదేశ్ లో అత్యంత కీలక వాణిజ్య ఓడరేవు అయిన కాక్స్ బజార్ కు కేవలం 9 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. బంగ్లాదేశ్ కు ఉన్న ఏకైక పగడపు దీవి అయినా సెయింట్ మార్టిన్ అరుదైన జీవ జాతులతో పర్యావరణంగా అత్యంత సున్నితమైన ప్రాంతం ఇది. సెయింట్ మార్టిన్ జనాభా 3,800 మంది మాత్రమే. చేపల వేట, వరి, కొబ్బరి తోటలు సాగు వీరి జీవనాధారం. ఎండబెట్టిన సీ విడ్ ను మయన్మార్ కు ఎగుమతి చేస్తుంటారు. సహజ సౌందర్యం కారణంగా ఇటీవల కాలంలో ఈ ద్వీపం పర్యాటక ప్రాంతంగాను మారింది. 1947లో భారత్ విభజన సమయంలో పాకిస్తాన్ కు, 1971లో బంగ్లాదేశ్ పరిధిలోకి వెళ్ళింది. మయన్మార్ కు కేవలం ఎనిమిది కిలో మీటర్ల దూరంలో ఉండడంతో సముద్ర సరిహద్దులు, చేపల వేట విషయంలో బంగ్లా - మయన్మార్ మధ్య తరచూ ఘర్షణలు జరుగుతున్నాయి. మయన్మార్కే కాకుండా ప్రపంచంలోనే సముద్ర వాణిజ్యానికి అత్యంత కీలకమైన మలక్క జల సంధికి అతి సమీపంలో ఉండడంతో సెయింట్ మార్టిన్సు ప్రాధాన్యంగా మారింది. ఇక కాక్స్ బజార్లో బెల్ట్ అండ్ రోడ్డు ఇనిసియేటివ్ కింద చైనా నౌకాశ్రయాన్ని అభివృద్ధి చేస్తోంది. అందుకే సెయింట్ మార్టిన్సులో సైనిక స్థావరం ఏర్పాటు చేసి చైనా, మయన్మార్ భారత్ పైన ఉంచాలని అమెరికా భావించింది. హిందూ మహాసముద్రంలో చైనా ఆధిపత్యాన్ని మరింత పెంచేలా బీఆర్ఐ లో బంగ్లా చేరడం కూడా ఆదేశానికి ఆందోళన కలిగించింది. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్ లో చిచ్చుకు రూపకల్పన చేసినట్లు విమర్శలతో కూడిన కథనాలు వస్తున్నాయి.