సూపర్ బిలియనీర్ల జాబితాలో అంబానీ, అదానీకి దక్కిన చోటు.. టాప్ లో ఎలాన్ మస్క్

ప్రపంచ వ్యాప్తంగా సూపర్ బిలియన్ల జాబితాలో భారతీయ కుబేరులు చోటు దక్కించుకున్నారు. ప్రపంచంలో 24 మంది సూపర్ బిలియనీర్ల జాబితాలో భారతీయ సంపన్నులు ముఖేష్ అంబానీ గౌతమ్ ఆదానీ స్థానం దక్కించుకున్నారు 5 వేల కోట్ల డాలర్ల (రూ.4.35 లక్షల కోట్లు) పైబడిన సంపద గల వారిని సూపర్ విలియనీర్లుగా వ్యవహరిస్తారు ఈ జాబితాలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ 41,900 కోట్ల డాలర్ల (36.45 లక్షల కోట్లు) నికర సంపదతో ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. జెఫ్ బెజోస్ 26,380 కోట్ల డాలర్లతో రెండో స్థానంలో నిలిచారు.

 Mukesh Ambani, Gautam Adani

ముఖేష్ అంబానీ గౌతమ్ ఆదానీ

ప్రపంచ వ్యాప్తంగా సూపర్ బిలియన్ల జాబితాలో భారతీయ కుబేరులు చోటు దక్కించుకున్నారు. ప్రపంచంలో 24 మంది సూపర్ బిలియనీర్ల జాబితాలో భారతీయ సంపన్నులు ముఖేష్ అంబానీ, గౌతమ్ ఆదానీ స్థానం దక్కించుకున్నారు 5 వేల కోట్ల డాలర్ల (రూ.4.35 లక్షల కోట్లు) పైబడిన సంపద గల వారిని సూపర్ విలియనీర్లుగా వ్యవహరిస్తారు ఈ జాబితాలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ 41,900 కోట్ల డాలర్ల (36.45 లక్షల కోట్లు) నికర సంపదతో ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు.  జెఫ్ బెజోస్ 26,380 కోట్ల డాలర్లతో రెండో స్థానంలో నిలిచారు. 9060 కోట్ల డాలర్లతో (రూ.7.88 లక్షల కోట్లు) అంబానీ 17వ స్థానంలో, 6060 కోట్ల డాలర్లతో (5.27 లక్షల కోట్ల) ఆదానీ 22వ స్థానంలో నిలిచారు. ప్రపంచ సంపదను ట్రాక్ చేసే అల్ట్రాట సంస్థ విడుదల చేసిన జాబితాలో ఈ వివరాలు ఉన్నాయి. సూపర్ బిలియన్లలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న మస్క్ సంపాదన గంటకు 20 లక్షల డాలర్లు అంటే అక్షరాల రూ.17.4 కోట్ల రూపాయలు. ఈ లెక్కన మస్క్ 2027 నాటికి ప్రపంచంలోనే తొలి ట్రిలియనిర్ అవుతాడని అంచనా.  ఒక సగటు అమెరికన్ సంపదతో పోలిస్తే మస్క్ సంపద 20 లక్షల రెట్లు అధికమని వెల్లడించింది. 

ఇటీవల కాలంలో ప్రపంచంలో కుబేరుల సంఖ్య విశేషంగా పెరుగుతోంది వీరిలో ఐదు కోట్ల డాలర్లు పైబడిన సంపద గల వారిని సూపర్ బిలియనీర్లుగా వర్గీకరిస్తున్నారు. ఫిబ్రవరి ప్రారంభం నాటికి ఈ సూపర్ బిల్లియనీర్లు ప్రపంచంలోని కుబేరుల సంపద మొత్తంలో 16 శాతం వాటా కలిగి ఉన్నట్టు ఆ నివేదిక తెలిపింది. 2014లో ఈ వాటా కేవలం నాలుగు శాతం ఉంది. వీరి మొత్తం సంపద 3.3 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. అంటే ఫ్రాన్స్ జిడిపితో సమానం. సూపర్ బిలియనీర్లుగా వర్గీకరించిన 24 మందిలో కూడా 16 మంది సెంటి బిలియనీర్లుగా (పదివేల కోట్ల డాలర్లు) గుర్తింపు పొందారు. 

కుబేర్లలోను అసమానతలు..

సమాజంలో సంపన్నులు, పేదల మధ్య ఆర్థిక వ్యత్యాసాలు పెరిగిపోతున్నట్టుగానే కుబేరుల్లో కూడా ఆర్థిక వ్యత్యాసాలు గణనీయంగా పెరుగుతున్నాయి. సూపర్ బిలియన్ల సంఖ్య గణనీయంగా పెరిగిపోతుండడంతో విలాసవంతమైన రంగాల్లో డిమాండ్ పెరుగుతోంది. ప్రధానంగా రియల్ ఎస్టేట్ రంగం పట్ల వారు మొగ్గు చూపుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత విలాసవంతమైన భవంతులు కొనుగోలు చేస్తున్నారు. న్యూయార్క్, మియామీ, పాంబీచ్ లాస్ ఏంజిల్స్, యాస్పెన్ వంటి నగరాలు లగ్జరీ రియల్ ఎస్టేట్ కేంద్రాలుగా మారుతున్నాయి. ఈ నగరాల్లో వీరి కోసమే ప్రత్యేకంగా విలాసానికి మారుపేరైన ఆకాశ హర్మ్యాలు నిర్మిస్తున్నారని ఆ నివేదిక వెల్లడించింది. అంతే కాకుండా ఈ భూమండలంపై అమిత ధనవంతులుగా పేరుపొందిన 15 మందిలో పది మంది టెక్నాలజీ రంగానికి చెందిన వారిని గణాంకాలు తెలుపుతున్నాయి. అంతే కాకుండా సంపద సృష్టిలో టెక్నాలజీ తరువాత రిటైల్, ఎనర్జీ, పారిశ్రామిక, ఫైనాన్స్, వినియోగ రంగాలు కుబేరులను సృష్టిస్తున్నాయి.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్