అల్లుడు కంపెనీలు, ఆదానీ పరిశ్రమల కోసమే ఢిల్లీకి మూటలు : కేటీఆర్

సీఎం రేవంత్ రెడ్డి పై భారతీయ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ట్విట్టర్ వేదికగా శనివారం ఉదయం ఆయన స్పందించారు. అల్లుడు పరిశ్రమల కోసం, ఆదాని కంపెనీల కోసమే ఢిల్లీకి రేవంత్ రెడ్డి మూటలు పంపిస్తున్నారంటూ ఆరోపించారు. తొలి గండం దాటితే తొంభై ఏండ్ల ఆయుష్షు అన్నది పెద్దల మాట అని పేర్కొన్న కేటీఆర్.. అల్లుడు కంపెనీలు, అదానీ పరిశ్రమలు, అన్నదమ్ముల ఆస్తుల పెంపు కోసమే ఢిల్లీకి మూటల చేరవేస్తున్నారని ఆరోపించారు.

BRS Working President KTR

భారతీయ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

సీఎం రేవంత్ రెడ్డి పై భారతీయ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ట్విట్టర్ వేదికగా శనివారం ఉదయం ఆయన స్పందించారు. అల్లుడు పరిశ్రమల కోసం, ఆదాని కంపెనీల కోసమే ఢిల్లీకి రేవంత్ రెడ్డి మూటలు పంపిస్తున్నారంటూ ఆరోపించారు. తొలి గండం దాటితే తొంభై ఏండ్ల ఆయుష్షు అన్నది పెద్దల మాట అని పేర్కొన్న కేటీఆర్.. అల్లుడు కంపెనీలు, అదానీ పరిశ్రమలు, అన్నదమ్ముల ఆస్తుల పెంపు కోసమే ఢిల్లీకి మూటల చేరవేస్తున్నారని ఆరోపించారు. పేదల భూములు లాక్కునేందుకు కాంగ్రెస్ సర్కార్ కుట్రలను ఎదుర్కొని, లాఠీల దెబ్బలు తిన్నప్పటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదని పేర్కొన్న కేటీఆర్.. చేతులకు బేడీలు వేసుకొని, నెలలపాటు చెరసాలల పాలైనా భూములను చెరబట్టడంలో మాత్రం రేవంత్ ప్రభుత్వం పట్టువదలడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పట్నంలో పేదల గూళ్లు, ఉపాధి కేంద్రాలు, పాల డబ్బాలు, చెప్పుల దుకాణాల్లో కూడా అధికారులు స్వైర విహారం చేస్తున్నారని ఆరోపించారు. పల్లెల్లో పేదల భూములు, గరీబోళ్ల ఇండ్లు, పంట పొలాలు, పచ్చని పైర్లలో రేవంత్ అధికారుల రెచ్చిపోతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాదేది అణచివేతకు అనర్హం కాదన్నట్టు తెలంగాణలో సాగుతున్న కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరపడ్డాయని వ్యాఖ్యానించారు. పదేళ్లు ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో ఏడాది కాలంగా ఏం జరుగుతున్నదో తెలియని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. దినదిన గండంగా తెలంగాణ మారిందని ఆవేదన వ్యక్తం చేసిన కేటీఆర్.. రేవంత్ రెడ్డి ఎప్పటికైనా ప్రజా అనుకూలమైన నిర్ణయాలను తీసుకోవాలని ట్విట్టర్లో పేర్కొన్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్