అల్లు అర్జున్ ను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు పట్ల అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కూడా స్పందించారు. పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ నటించిన సినిమాను ఉద్దేశించి చేసినట్టుగా భావిస్తున్న వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ వివరణ ఇవ్వాలంటూ అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ వివరణ ఇవ్వాలని కోరారు.
అల్లు అర్జున్, చంద్రశేఖర్ రెడ్డి
గత కొద్దిరోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్ వార్ నడుస్తోంది. గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రముఖ నటుడు అల్లు అర్జున్ తన స్నేహితుడైన శిల్ప రవిచంద్ర రెడ్డికి మద్దతుగా నంద్యాలకు వెళ్లి ప్రచారం చేశారు. ఆ తర్వాత నుంచి పవన్ కళ్యాణ్ అభిమానులు అల్లు అర్జున్ లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ కూడా ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే సినిమాలు తీయడం పట్ల కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది అల్లు అర్జున్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలుగా అభిమానులు ఫీల్ అవుతున్నారు. దీంతో ఇటు అల్లు అర్జున్ అభిమానులు కూడా పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమాలు వేదికగా పవన్ కళ్యాణ్, ఆయన నటించిన సినిమాలపై విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మెగా ఫ్యామిలీ మధ్యలో పుట్టిన ఈ ముసలం రోజురోజుకు తారాస్థాయికి చేరుతోంది. అల్లు అర్జున్ ను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు పట్ల అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కూడా స్పందించారు. పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యానించారు.
పవన్ కళ్యాణ్ మాటలపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసిన చంద్రశేఖర్ రెడ్డి
పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ నటించిన సినిమాను ఉద్దేశించి చేసినట్టుగా భావిస్తున్న వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ వివరణ ఇవ్వాలంటూ అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ వివరణ ఇవ్వాలని కోరారు. పవన్ కళ్యాణ్ ఏ అంశంపై ఇలా మాట్లాడారో స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ఆయనపై ఉందన్నారు. ఒక సినిమా కోసం మాత్రమే అల్లు అర్జున్ నటించాడన్న విషయం పవన్ కళ్యాణ్ కు కూడా తెలుసని, అలాంటప్పుడు ఈ వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ఇప్పటికైనా పవన్ జోక్యం చేసుకుని తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇవ్వాలని స్పష్టం చేశారు. తాను మాట్లాడింది పుష్ప సినిమా గురించి కాదు అని చెప్పి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. పవన్ కళ్యాణ్ స్పందించనంత వరకు ఈ వివాదానికి పుల్ స్టాప్ పడదన్నారు. అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డు వచ్చింది పాలిటిక్స్ లో కాదని, సినిమాల్లో అన్న విషయాన్నీ గుర్తించుకోవాలని పవన్ కళ్యాణ్ కు చంద్రశేఖర్ రెడ్డి చురకలు అంటించారు. బన్నీ చాలా మెచ్యూర్డ్ నటుడని, తను సినిమాల్లో మాత్రమే ఉన్నారనే విషయాన్ని గ్రహించాలన్నారు. ఆయన అభిమానులకు, స్నేహితులకు ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతో ఉంటారని, నమ్మిన వారి కోసం బన్నీ ఎంత దూరమైనా వెళ్తారని స్పష్టం చేశారు.