ఏపీలో నూతనంగా అమలు చేస్తున్న మద్యం విధానంలో భాగంగా గీత కులాలకు కొన్ని దుకాణాలను ప్రభుత్వం కేటాయించింది. వీటికి సంబంధించిన లెక్క తాజాగా తేలింది. గీత కులాల వారికి 335 మద్యం షాపులను రిజర్వ్ చేస్తూ ప్రభుత్వం నూతన మద్యం పాలసీని విడుదల చేసింది ఆ షాపుల కేటాయింపులకు సంబంధించిన మార్గదర్శకాలను పేర్కొంటూ ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంకే మేన ఉత్తర్వులు విడుదల చేశారు 2016లో నిర్వహించిన స్మార్ట్ పల్స్ సర్వే ప్రామాణికంగా గీత కులాల జనాభాను పరిగణలోకి తీసుకొని ఆయా జిల్లాల్లో గీత ఒక కులాల వారికి వేరువేరుగా మద్యం షాపులను కేటాయించారు ఇందులో యాత, గౌడ, ఈడిగ, గామళ్ళ, కలాలీ, గౌండ్ల, శ్రీశయన(సెగిడి), శెట్టి బలిజి కులాలకు వారి జనాభా నిష్పత్తి ప్రకారం ఈ షాపులను కేటాయించనున్నారు.
ప్రతీకాత్మక చిత్రం
ఏపీలో నూతనంగా అమలు చేస్తున్న మద్యం విధానంలో భాగంగా గీత కులాలకు కొన్ని దుకాణాలను ప్రభుత్వం కేటాయించింది. వీటికి సంబంధించిన లెక్క తాజాగా తేలింది. గీత కులాల వారికి 335 మద్యం షాపులను రిజర్వ్ చేస్తూ ప్రభుత్వం నూతన మద్యం పాలసీని విడుదల చేసింది ఆ షాపుల కేటాయింపులకు సంబంధించిన మార్గదర్శకాలను పేర్కొంటూ ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంకే మేన ఉత్తర్వులు విడుదల చేశారు 2016లో నిర్వహించిన స్మార్ట్ పల్స్ సర్వే ప్రామాణికంగా గీత కులాల జనాభాను పరిగణలోకి తీసుకొని ఆయా జిల్లాల్లో గీత ఒక కులాల వారికి వేరువేరుగా మద్యం షాపులను కేటాయించారు ఇందులో యాత, గౌడ, ఈడిగ, గామళ్ళ, కలాలీ, గౌండ్ల, శ్రీశయన(సెగిడి), శెట్టి బలిజి కులాలకు వారి జనాభా నిష్పత్తి ప్రకారం ఈ షాపులను కేటాయించనున్నారు. ఉమ్మడి చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాలోని శెట్టి బలిజలు ఓసిల్లో ఉన్నందున.. ఆయా జిల్లాల్లో శెట్టి బలిజలకు ఈ పాలసీ వర్తించదు. షెడ్యూల్ ప్రాంతాల్లో గీత కులాలకు షాపులు కేటాయించరు. ఎక్కడ షాపులు పెట్టాలి అనేది ఆయా జిల్లాల్లో ఎక్సైజ్ అధికారులు నిర్ణయించనున్నారు. ప్రాంతాలను నిర్ణయించిన అనంతరం జిల్లాలోని ఎక్సైజ్ అధికారులు దరఖాస్తులను ఆహ్వానిస్తారు. ఆన్లైన్, ఆఫ్లైన్, హైబ్రిడ్ విధానంలో దరఖాస్తులను స్వీకరించనున్నారు. కలెక్టర్ల సమక్షంలో లాటరీ ద్వారా లైసెన్స్ దారులను ఎంపిక చేస్తారు. దరఖాస్తుదారులు తప్పనిసరిగా కుల ధ్రువీకరణ, స్వస్థల ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఒక్కో దరఖాస్తు రుసుము 2 లక్షలు గా నిర్ణయించారు. ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ సాపులకు దరఖాస్తులు చేసుకోవచ్చు.
అయితే వారంతా గీతకురాదుకు చెందినవారైనప్పటికీ ఆయా ఉప కులాలకు నోట్ 5 చేసిన షాపులకు దరఖాస్తులు చేసుకోవడానికి వీల్లేదు. ఫిబ్రవరి 7వ తేదీన లాటరీ నిర్వహించి లైసెన్సీలను ఎంపిక చేస్తారు. ఒక వ్యక్తికి ఒక్క షాపు మాత్రమే కేటాయించనున్నారు. ఒకవేళ ఒకే వ్యక్తికి రెండు షాపులు లాటరీలో వస్తే దరఖాస్తుదారుల అభీష్టం మేరకు వారు కోరుకున్న షాపును కేటాయించి.. మిగిలిన షాపు లైసెన్సును రద్దు చేస్తారు. అక్టోబర్ నుంచి అమలులోకి వచ్చిన సాధారణ మద్యం పాలసీ లైసెన్స్ దారులు చెల్లించే మొత్తంలో 50 శాతం లైసెన్స్ ఫీజు మాత్రమే గీత కులాల లైసెన్సీలు చెల్లిస్తే సరిపోతుంది. 2026 సెప్టెంబర్ వరకు ఈ లైసెన్సుల గడువు ఉంటుంది. ఈ నిర్ణయం పట్ల గీత కులాలకు చెందిన వాళ్లు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమకు ప్రభుత్వం సరైన గౌరవాన్ని కల్పిస్తుందని వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయాన్ని అమలు చేయడం పట్ల రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. కళ్ళుగీత కార్మికులకు 10% మద్యం షాపులు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం శుభ పరిణామం అన్నారు. కళ్ళు గీత కార్మికులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీని చంద్రబాబు నేతృత్వంలోని కూటం ప్రభుత్వం నెరవేర్చిందని వ్యాఖ్యానించారు. కుల వృత్తినే నమ్ముకుని ఇబ్బందులు పడుతున్న గీత కార్మికులకు మద్యం దుకాణాలు కేటాయించడం చారిత్రక నిర్ణయమని పేర్కొన్నారు.