రేషన్ కార్డుల మంజూరుకు సంబంధించి కూటమి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. గడిచిన కొన్నాళ్లుగా రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది అర్హులైన లబ్ధిదారులు రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. వీరంతా ఎప్పుడెప్పుడు రేషన్ కార్డులు మంజూరు చేస్తారా అని ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు పలువురు రేషన్ కార్డుల మంజూరుకు సంబంధించి శాసనసభలో ప్రశ్నలు సంధించారు. రాష్ట్రంలో వేలాది మంది అరకులైన లబ్ధిదారులు రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారంటూ ప్రశ్నించడంతోపాటు ఎప్పుడు కొత్త కార్డులు మంజూరు చేస్తారని అడిగారు.
రేషన్ కార్డులు
రేషన్ కార్డుల మంజూరుకు సంబంధించి కూటమి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. గడిచిన కొన్నాళ్లుగా రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది అర్హులైన లబ్ధిదారులు రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. వీరంతా ఎప్పుడెప్పుడు రేషన్ కార్డులు మంజూరు చేస్తారా అని ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు పలువురు రేషన్ కార్డుల మంజూరుకు సంబంధించి శాసనసభలో ప్రశ్నలు సంధించారు. రాష్ట్రంలో వేలాది మంది అరకులైన లబ్ధిదారులు రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారంటూ ప్రశ్నించడంతోపాటు ఎప్పుడు కొత్త కార్డులు మంజూరు చేస్తారని అడిగారు. దీనిపై స్పందించిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. కొత్త కార్డుల మంజూరు ప్రక్రియ ఇప్పట్లో ఉండదని ఆయన స్పష్టం చేశారు. దీంతో కొత్త కార్డుల కోసం ఎదురుచూస్తున్న వేలాదిమంది అర్హులైన అభ్యర్థులు మరింతకాలం నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం బియ్యం కార్డులు ఈ కేవైసీ నిర్వహణలో ఉన్నందువల్ల సేవలు నిలిపివేసినట్లు నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. కొత్త బియ్యం కార్డులకు, కార్డుల విభజనకు వీలు కల్పించే ప్రతిపాదనలు ఉన్నట్లు వెల్లడించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ప్రకారం మార్చి 30నాటికి ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేస్తామని వివరించారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత కొత్త కార్డుల మంజూరు ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
మరింతకాలం తప్పని నిరీక్షణ..
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సుమారు ఏడాదిన్నర కాలం పాటు రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ నిలిపివేశారు. కొత్త కార్డుల మంజూరుకు అనుగుణంగా దరఖాస్తులను స్వీకరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఎమ్మెల్సీ ఎన్నికలు ఆ తర్వాత జరిగిన పరిణామాలతో నేపథ్యంలో కొత్త కార్డులు మంజూరు కాలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా కొత్త కార్డులు మంజూరు చేస్తారని చాలామంది ఆశావహులు ఆశించారు. అయితే సుమారు 10 నెలలు దాటుతున్న ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం రేషన్ కార్డుల మంజూరుకు సంబంధించి ఎటువంటి ప్రకటన చేయలేదు. తాజాగా పలువురు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో దీనిపై పౌరసరఫరాల శాఖ మంత్రి మనోహర్ కీలక ప్రకటన చేశారు. ఈ ప్రకటన ఆశావాహుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. మరింత కాలం పాటు తాము ప్రభుత్వ పథకాలపు దూరంగా ఉండాల్సిన దుస్థితి ఏర్పడుతుందని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.