విశాఖ మేయర్ పీఠంపై కూటమి కన్ను.. బెంగళూరు శిబిరంలో వైసీపీ కార్పొరేటర్లు

ఏపీలోని అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ విశాఖపట్నంపై కూటమి ప్రభుత్వం కన్నేసింది. అధికారం చేపట్టిన వెంటనే మేయర్ ను మార్చాలని స్కెచ్ వేసింది. అయితే నిబంధనలో నాలుగేళ్ల పాటు అవిశ్వాసం పెట్టకూడదనీ ఉండడంతో కూటమి నాయకులు సైలెంట్ అయిపోయారు. మేయర్గా అధికారాన్ని చేపట్టిన గోలగాని హరి వెంకట కుమారి నాలుగేళ్లు పూర్తి చేసుకోవడంతో అవిశ్వాస తీర్మానాన్ని పెట్టేందుకు కూటమి నాయకులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలువురు కార్పొరేటర్లు వైసిపి, జనసేనలో చేరిపోయారు. కొద్దిరోజుల్లోనే అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కూటమి నాయకులు ఇప్పటికే కలెక్టర్ ను కలిసి తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. కూటమి నాయకుల ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ వైసిపి నాయకులు కూడా వ్యూహాలకు పదును పెట్టారు. తమ కార్పొరేటర్లు కూటమి నాయకులకు అందుబాటులో లేకుండా చేసేందుకు క్యాంపు రాజకీయాలకు తెరతీసింది వైసిపి.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

ఏపీలోని అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ విశాఖపట్నంపై కూటమి ప్రభుత్వం కన్నేసింది. అధికారం చేపట్టిన వెంటనే మేయర్ ను మార్చాలని స్కెచ్ వేసింది. అయితే నిబంధనలో నాలుగేళ్ల పాటు అవిశ్వాసం పెట్టకూడదనీ ఉండడంతో కూటమి నాయకులు సైలెంట్ అయిపోయారు. మేయర్గా అధికారాన్ని చేపట్టిన గోలగాని హరి వెంకట కుమారి నాలుగేళ్లు పూర్తి చేసుకోవడంతో అవిశ్వాస తీర్మానాన్ని పెట్టేందుకు కూటమి నాయకులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలువురు కార్పొరేటర్లు వైసిపి, జనసేనలో చేరిపోయారు. కొద్దిరోజుల్లోనే అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కూటమి నాయకులు ఇప్పటికే కలెక్టర్ ను కలిసి తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. కూటమి నాయకుల ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ వైసిపి నాయకులు కూడా వ్యూహాలకు పదును పెట్టారు. తమ కార్పొరేటర్లు కూటమి నాయకులకు అందుబాటులో లేకుండా చేసేందుకు క్యాంపు రాజకీయాలకు తెరతీసింది వైసిపి. తమ పార్టీకి చెందిన కార్పొరేటర్లను కొద్ది రోజుల కిందట బెంగుళూరులోని ప్రత్యేక శిబిరానికి తరలించినట్లు తెలుస్తోంది. ఏపీలో అనుకూలంగా ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ లను, మునిసిపాలిటీలను దక్కించుకోవడానికి ఓటమి ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే విశాఖ కార్పొరేషన్ పై కూడా కూటమి నాయకులు దృష్టి సారించారు. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 98 డివిజన్లో 56 మంది కార్పొరేటర్ లను వైసీపీ గెలుచుకొని మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. టిడిపి 30 మంది కార్పొరేటర్లను గెలుచుకుంది. జనసేన అయిదుగురు కార్పొరేట్లను గెలుచుకుంది. బిజెపి, సిపిఎం, సిపిఐ నుంచి ఒక్కో కార్పొరేటర్ గెలిపించారు. మరో నలుగురు స్వతంత్రులుగా విజయం సాధించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత టిడిపి, జనసేన, బిజెపి కార్పొరేటర్లతో ఇండిపెండెంట్ లు కూడా కలిసిపోయారు.

వైసీపీ నుంచి కూడా కొందరు కార్పొరేటర్లు పార్టీ మారడంతో ప్రస్తుతం వైసీపీ బలం 36కు తగ్గిపోయింది. కూటమి ఎక్స్ అఫీషియో ఓట్లతో కలిపి 70 మంది బలం కూటమికి దక్కింది. జీవీఎంసీ కార్పొరేషన్ మేయర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి 74 ఓట్లు కావాలి. అంటే కూటమికి ఇంకా నలుగురు కార్పోరేటర్లు రావాల్సి ఉంది. దీంతో కూటమి నాయకులు అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు అవకాశం లేకుండా వైసిపి నాయకులు క్యాంపు రాజకీయాలకు తెరలు తీశారు. తమ పార్టీకి చెందిన కార్పొరేటర్ లను బెంగుళూరుకు తరలించారు. ఏప్రిల్ 5వ తేదీ లోపు మేయర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టాలనుకుంటున్న కూటమి నాయకులకు వైసీపీ కార్పొరేటర్లు అందుబాటులో లేకుండా చేయడం ద్వారా వారి ఎత్తులకు చెక్ చేప్పినట్లు అయింది వైసిపి. బెంగళూరులోనే ప్రత్యేక శిబిరంలో వైసీపీకి చెందిన కార్పొరేటర్లు ఉండేలా మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్ ప్రత్యేకంగా కార్పొరేటర్లతో చర్చించి ఈ క్యాంపు ఏర్పాట్లు చేశారు. దీంతో కూటమి నాయకులకు ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. వైసీపీకి చెందిన మేయర్ పదవీకాలం మరో ఏడాది పాటు ఉంది. ఏడాదికాలాన్ని కాపాడుకోవడం ద్వారా తమ బలాన్ని చాటుకోవాలని ఉద్దేశంతో వైసిపి ఉంది. ఒక్క ఏడాదిపాటైన పదవిని తీసుకోవడం ద్వారా తమ సత్తా చాటాలని కోటం నాయకులు భావిస్తున్నారు. కోటమి తరుపున మేయర్ అభ్యర్థిగా టిడిపి ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసును కూర్చోబెట్టాలని ఆ పార్టీ అగ్రనాయకత్వం భావిస్తోంది. అందుకే శ్రీనివాస్ వైసీపీ కార్పొరేటర్ లను టిడిపిలో చేర్చడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. మేయర్ తోపాటు డిప్యూటీ మేయర్ పదవి కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేని వైసిపి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అవిశ్వాస తీర్మానం కూటమినెగకుండా చేయగలమని సవాల్ విసురుతోంది. మరి ఈ వ్యవహారంలో ఎవరు నెగ్గుతారో చూడాల్సి ఉంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్