||ప్రతీకాత్మక చిత్రం||
ఈవార్తలు, హైదరాబాద్ : హైదరాబాద్ మందు బాబులకు పోలీసులు చేదు వార్త చెప్పారు. ఈ నెల 6వ తేదీన హనుమాన్ జయంతిని పురస్కరించుకొని కీలక ప్రకటన చేశారు. నగర వ్యాప్తంగా మద్యం దుకాణాలను మూసివేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు అన్ని వైన్ షాపుల యజమానులకు రాచకొండ పోలీస్ కమిషనరేట్ సీపీ డీఎస్ చౌహాన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలు 6వ తేదీన ఉదయం 6 గంటల నుంచి 7వ తేదీన ఉదయం 6 గంటల వరకు అమల్లో ఉంటాయని వివరించారు. ఈ సమయంలో మద్యం దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు, కల్లు దుకాణాలు మూసి ఉంటాయని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.