కాంగ్రెస్ పాపం ఫలితమే ఇదంతా.. రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్ ఆగ్రహం

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం వరస ట్వీట్లతో ఆయన ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన ప్రభుత్వానికి పలు ప్రశ్నలను సంధించారు. నీళ్లు సముద్రం పాలవుతున్న ఒడిసి పట్టలేని అసమర్ధ ప్రభుత్వం అంటూ విమర్శించారు. కాలేశ్వరం పొంగిన పిల్లర్లను చూపి నీటిని కిందకు వదిలేస్తున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. యతెచ్చుగా ఇసుక వ్యాపారం చేస్తున్నారంటూ కాంగ్రెస్ పై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు కేటీఆర్.

Brs Working President Ktr

బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం వరస ట్వీట్లతో ఆయన ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన ప్రభుత్వానికి పలు ప్రశ్నలను సంధించారు. నీళ్లు సముద్రం పాలవుతున్న ఒడిసి పట్టలేని అసమర్ధ ప్రభుత్వం అంటూ విమర్శించారు. కాలేశ్వరం పొంగిన పిల్లర్లను చూపి నీటిని కిందకు వదిలేస్తున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. యతెచ్చుగా ఇసుక వ్యాపారం చేస్తున్నారంటూ కాంగ్రెస్ పై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు కేటీఆర్. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లుగా రేవంత్ రెడ్డి వ్యవహార శైలి ఉందన్నారు. నీళ్లన్నీ తరలించకపోయిన తర్వాత అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వం తీరిగ్గా టెలీ మెట్రీల  గురించి మాట్లాడుతుండంటూ మండిపడ్డారు. కృష్ణ, గోదావరి నదుల నుంచి వేల టిఎంసిల నీళ్లు సముద్రం పాలవుతున్న ఒడిసిపట్టే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదని ఆరోపించారు. నాలుగున్నర దశాబ్దాల కాంగ్రెస్ పాలన పాపం ఫలితమే తెలంగాణకు కృష్ణ, గోదావరి నది జలాల్లో నీటి వాట తేలకపోవడానికి కారణమని ఆరోపించారు.

కెసిఆర్ పాలనలో కాలేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలను వడివడిగా పూర్తి చేసి వందల టిఎంసిల ఓడిసిపట్టేందుకు రిజర్వాయర్లు నిర్మించారని పేర్కొన్నారు. పొంగిన కాలేశ్వరం పిల్లర్లను చూపించి మరమ్మత్తులు చేపట్టకుండా నీళ్లను కిందకు వదిలి ఇసుకను దోచుకుంటున్నారని ఆరోపించారు కేటీఆర్. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద 50 టీఎంసీల రిజర్వాయర్లు సిద్ధంగా ఉన్నాయని, నీళ్లు ఎత్తిపోసుకునేందుకు నార్లాపూర్ వద్ద నాలుగు మోటర్లు సిద్ధంగా ఉన్న టెండర్లు రద్దు చేశారని ఆరోపించారు. 15 నెలలుగా పనులు పడావు పెట్టారన్నారు. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పొలాలను ఎండబెట్టి ఇసుక వ్యాపారం చేస్తోందంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అన్నం పెట్టే అన్నదాతకు సున్నం పెట్టి అధికారం ఇచ్చిన తెలంగాణ ప్రజలను నిలువునా మోసగిస్తున్నారని ఆరోపించారు. జాగో తెలంగాణ జాగో అంటూ కేటీఆర్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్