సీఎం చంద్రబాబుకు అన్ని కులాలు మద్దతు.. కులాన్ని ఆపాదించిన విజయసాయిపై బుద్ధ ఫిర్యాదు

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కు రాష్ట్రంలోని అన్ని కులాలు అండగా ఉన్నాయని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్ధ వెంకన్న పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు ఒక కులానికి మేలు చేకూరుస్తున్నారంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలపై బుద్ధ వెంకన్న స్పందించారు. చంద్రబాబుకు కులాన్ని అంటగట్టే ప్రయత్నం చేసిన విజయసాయి రెడ్డి పై ఆయన విజయవాడ సిపి రాజశేఖర్ కు ఆదివారం ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని కోరారు.

tdp leader buddha venkanna

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్ధ వెంకన్న

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కు రాష్ట్రంలోని అన్ని కులాలు అండగా ఉన్నాయని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్ధ వెంకన్న పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు ఒక కులానికి మేలు చేకూరుస్తున్నారంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలపై బుద్ధ వెంకన్న స్పందించారు. చంద్రబాబుకు కులాన్ని అంటగట్టే ప్రయత్నం చేసిన విజయసాయి రెడ్డి పై ఆయన విజయవాడ సిపి రాజశేఖర్ కు ఆదివారం ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని కోరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ విజయసాయిరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి కులాన్ని ఆపాదించిన విజయసారెడ్డిపై తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.  సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును వైసీపీ ప్రభుత్వం వస్తే జైల్లో వేస్తామని విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై కేసు నమోదు చేయాలంటూ ఆయన విజయవాడ సిపిని కోరారు. విజయ్ సాయి రెడ్డి వ్యాఖ్యలపై పోలీసులకు స్పందించకుంటే, కేసు నమోదు చేయకుంటే కోర్టును ఆశ్రయిస్తామని పేర్కొన్నారు.

అన్ని కులాలు మద్దతు ఇస్తేనే కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిందని ఈ సందర్భంగా బుద్దా వెంకన్న పేర్కొన్నారు. చంద్రబాబుకు అన్ని కులాలు అండగా ఉన్నాయన్నారు. విజయసాయిరెడ్డి మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆరోపించారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి స్కామ్ లో జైలుకు వెళతారని తెలిసి ముందుగానే ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు అంటూ పేర్కొన్నారు. గతంలో పింక్ డైమండ్ చంద్రబాబు ఇంట్లో ఉందని విష ప్రచారం విజయసాయిరెడ్డి చేశాడని, వైసిపి పార్టీ టైటానిక్ షిప్ మాదిరిగా మునిగిపోయిందన్నారు. కమ్మ కులానికి చెందిన ఆస్తులు లాకుంటే చంద్రబాబు వాళ్లకు అండగా నిలబడకూడదా అని ఈ సందర్భంగా బుద్ధ వెంకన్న ప్రశ్నించారు. వైసిపి పని అయిపోయిందని, ఆ పార్టీని నమ్ముకుంటే నట్టేట మునుగుతామన్న ఉద్దేశంతోనే చాలామంది నేతలు బయటకు వస్తున్నారని వ్యాఖ్యానించారు. గడచిన ఐదేళ్లలో అడ్డగోలు వ్యవహారాలకు పాల్పడిన వైసీపీ నేతలు జైలుకు పోతారని హెచ్చరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో సంక్షేమ ఫలాలను ప్రజలకు అందిస్తున్నారని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు పై ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు. రానున్న రోజుల్లో ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి దశగా తీసుకెళ్లే అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేస్తుందని ఈ సందర్భంగా బుద్ధ వెంకన్న స్పష్టం చేశారు. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్