పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. పరీక్షా ఫలితాలు ఎప్పుడంటే.!

తెలంగాణలో పదో తరగతి విద్యార్థులకు పరీక్షలు తాజాగా ముగిశాయి. మార్చి 21న ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 2వ తేదీ వరకు అత్యంత పకడ్బందీగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా 2,650 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షలకు సుమారు 5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. కొన్నిచోట్ల వచ్చిన పేపర్ లీకేజీ ఘటనలు మినహా పరీక్షలను ప్రశాంతంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించింది. తెలంగాణ ఎస్ఎస్సి బోర్డు మూల్యాంకనం నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లను చేసింది. పరీక్షలను నిర్వహించిన ప్రభుత్వం పరీక్షల డైరెక్టర్ ఏప్రిల్ ఏడో తేదీ నుంచి 15 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 19 శిబిరాల్లో సమాధాన పత్రాల స్పాట్ మూల్యాంకనాన్ని నిర్వహించనుంది.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో పదో తరగతి విద్యార్థులకు పరీక్షలు తాజాగా ముగిశాయి. మార్చి 21న ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 2వ తేదీ వరకు అత్యంత పకడ్బందీగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా 2,650 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షలకు సుమారు 5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. కొన్నిచోట్ల వచ్చిన పేపర్ లీకేజీ ఘటనలు మినహా పరీక్షలను ప్రశాంతంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించింది. తెలంగాణ ఎస్ఎస్సి బోర్డు మూల్యాంకనం నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లను చేసింది. పరీక్షలను నిర్వహించిన ప్రభుత్వం పరీక్షల డైరెక్టర్ ఏప్రిల్ ఏడో తేదీ నుంచి 15 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 19 శిబిరాల్లో సమాధాన పత్రాల స్పాట్ మూల్యాంకనాన్ని నిర్వహించనుంది. దీని తర్వాత ఫలితాలు వెలువడుతాయి. మూల్యాంకనం పూర్తి అవడానికి దాదాపు 20 రోజులు సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ తరువాత ఫలితాలను వెలువరించే అవకాశం ఉంది. పరీక్షలు ముగిసిన ఒక నెలలోపు ఫలితాలను వెల్లడించేందుకు జోరుగా ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అంటే మే రెండో తేదీ నాటికి పరీక్ష ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉందని అధికార యంత్రాంగం చెబుతోంది. అందుకు అనుగుణంగానే మూల్యాంకనం జోరుగా నిర్వహించేలా ఏర్పాటులను అధికారులు పూర్తి చేశారు. కొద్దిరోజుల్లోనే మూల్యాంకనం ప్రక్రియ ప్రారంభం కానుంది. పదో తరగతి పరీక్షలు పూర్తి కావడంతో ఫలితాలు ఎప్పుడు విడుదలవుతాయి అన్న చర్చ జోరుగా జరుగుతున్న నేపథ్యంలో అధికారులు తాజాగా చెబుతున్న మాటలను బట్టి రెండో తేదీ నాటికి గాని మొదటి వారంలో గాని ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.

ఒకవేళ మూల్యాంకనం ప్రక్రియ వేగంగా పూర్తయితే ఏప్రిల్ చివరి వారంలో వెలువరించే అవకాశం ఉందని చెబుతున్నారు. అందుకు అనుగుణంగానే మూల్యాంకనం ప్రక్రియను అధికారులు చేపడుతున్నారు. పదో తరగతి పరీక్షలకు సంబంధించి పటిష్టంగా నిర్వహించిన ప్రభుత్వం.. ఫలితాలను కూడా అంతే వేగంగా ఇచ్చేందుకు ఏర్పాటు చేస్తోంది. ఈసారి రాష్ట్ర ప్రభుత్వం గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేసి విద్యార్థులకు మార్కులు కేటాయిస్తోంది.  దీనికి సంబంధించిన ఏర్పాట్లను కూడా ప్రభుత్వం పూర్తి చేసింది. ఇంటర్నల్ పరీక్షలకు 20, ఎక్స్టర్నల్ పరీక్షలకు 80 మార్కులను కేటాయించింది. ప్రస్తుతం ఓరియంటల్ సైన్స్ కు సంబంధించి రెండు పరీక్షలు ఈనెల మూడు నాలుగు తేదీల్లో జరగనున్నాయి. వీటికి కొద్ది మంది మాత్రమే విద్యార్థులు హాజరవుతారని అధికారులు చెబుతున్నారు. అంటే నాలుగో తేదీతో పరీక్షలు పూర్తి కానున్నాయి. శుక్రవారం నాటికి ఇంటర్ పరీక్షలు పూర్తిగా పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు. ఇంటర్ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను వేగంగా విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేయడంతో విద్యార్థులు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఫలితాలు వేగంగా విడుదలయితే తదుపరి ఏం చేయాలన్న దానిపై విద్యార్థులు సమాలోచనలు జరిపేందుకు అవకాశం ఉంటుంది. ప్రభుత్వ నిర్ణయం వల్ల విద్యార్థులకు ఒత్తిడి లేకుండా ఉంటుందని, ఇంటర్లో వచ్చిన మార్పులను బట్టి తదుపరి ఏం చదవాలన్న దానిపై కొంత చర్చించుకునేందుకు విద్యార్థులకు అవకాశం దొరుకుతుందని పలువురు పేర్కొంటున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్