గూగుల్ క్రోమ్ యూజర్లకు అలర్ట్.. అప్రమత్తంగా ఉండాలంటున్న కేంద్రం

సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ క్రోమ్ ను వినియోగించే వారి సంఖ్య కోట్లలో ఉంటుంది. ప్రతిరోజు విభిన్నమైన అంశాలకు సంబంధించి గూగుల్ క్రోమ్ వినియోగించి చాలామంది సెర్చ్ చేస్తుంటారు. అయితే ఈ గూగుల్ క్రోమ్ వినియోగించేవారు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. స్మార్ట్ ఫోన్, లాప్టాప్, విండోస్ లో గూగుల్ క్రోమ్ ను యూస్ చేస్తుంటే అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ మేరకు సెంట్రల్ గవర్నమెంట్ గూగుల్ క్రోమ్ యూజర్లకు బిగ్ అలర్ట్ జారీ చేసింది.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ క్రోమ్ ను వినియోగించే వారి సంఖ్య కోట్లలో ఉంటుంది. ప్రతిరోజు విభిన్నమైన అంశాలకు సంబంధించి గూగుల్ క్రోమ్ వినియోగించి చాలామంది సెర్చ్ చేస్తుంటారు. అయితే ఈ గూగుల్ క్రోమ్ వినియోగించేవారు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. స్మార్ట్ ఫోన్, లాప్టాప్, విండోస్ లో గూగుల్ క్రోమ్ ను యూస్ చేస్తుంటే అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ మేరకు సెంట్రల్ గవర్నమెంట్ గూగుల్ క్రోమ్ యూజర్లకు బిగ్ అలర్ట్ జారీ చేసింది. విండోస్, లైనక్స్, మాక్ లో గూగుల్ క్రోమ్ ని ఉపయోగిస్తుంటే వెంటనే అప్డేట్ చేసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. లేకపోతే సైబర్ ముప్పు పొంచి ఉందని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ వెల్లడించింది. గూగుల్ క్రోమ్ లో క్లిష్టమైన భద్రతా లోపాల గురించి ప్రభుత్వం హై రిస్క్ హెచ్చరికను జారీ చేసింది. యూజర్లను గూగుల్ క్రోమ్ అప్డేట్ చేసుకోవాలని కోరుతోంది.

గూగుల్ క్రోమ్ లోని లోపాలతో హ్యాకర్స్ అటాచ్ చేసే ఛాన్స్ ఉందని వెల్లడించింది. యూజర్ల డేటా, సున్నితమైన సమాచారాన్ని చోరీ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. ఈ ముప్పు నుంచి తప్పించుకోవాలంటే అప్డేట్ తప్పనిసరి అని సూచించింది. పీసీలు, లాప్టాప్ విండోస్ ఆపరేటింగ్ సిస్టం యూజర్స్ తోపాటు మాక్ యూజర్లు అప్రమత్తంగా ఉండాలని ఈ హెచ్చరికలో పేర్కొంది. అదే స్మార్ట్ ఫోన్ యూజర్లకు పెద్ద ప్రమాదం ఏమీ ఉండకపోవచ్చునే కేంద్రం వెల్లడించింది. 132.0.6834.83/8r, 132.0.6834.110/111 కు ముందు వెర్షన్ గూగుల్ క్రోమ్ ను వాడుతున్నట్లయితే తప్పనిసరిగా అప్డేట్ చేయాలని స్పష్టం చేసింది. ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లినక్స్ యూజర్లు 132.0.6.6834.110 వెర్షన్ కు ముందు క్రోమ్ వాడుతున్నట్లయితే.. లేటెస్ట్ వెర్షన్కు మారాలని పేర్కొంది. లేకపోతే డేటా హ్యాకింగ్ కు గురయ్యే అవకాశం ఉందని పేర్కొంది. కాబట్టి క్రోమ్ వినియోగదారులు ఈ జాగ్రత్తలను తీసుకోవాలని మిత్రులు సూచిస్తున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్