ఐశ్వర్యారాయ్ పుట్టినరోజు. ఆమె పుట్టినరోజు నేపథ్యంలో సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు సామాజిక మాధ్యమాలు వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే ఐశ్వర్యారాయ్ భర్త అభిషేక్ బచ్చన్, మామ అమితాబ్ బచ్చన్ మాత్రం ఆమెకు శుభాకాంక్షలు తెలియజేయలేదు. ఇదే ఇప్పుడు శని వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరి మధ్య మనస్పర్ధలు ఉండడం వల్లే శుభాకాంక్షలు చెప్పేందుకు కూడా అభిషేక్ బచ్చన్ అంగీకరించ లేదంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
ఐశ్వర్యారాయ్, అభిషేక్ బచ్చన్
ఈ మధ్య కాలంలో సినీ నటుల దాంపత్య జీవితం అర్ధాంతరంగా ముగిసిపోతుంది. కలకాలం కలిసి ఉంటారని భావించిన జంటలు మధ్యలోనే విడాకులు తీసుకుని విడిపోతున్నాయి. ఈ జాబితాలోకి ఐశ్వర్యారాయ్, అభిషేక్ బచ్చన్ దంపతులు కూడా చేరబోతున్నారా అంటే అవునన్న సమాధానమే సినీ వర్గాల నుంచి వినిపిస్తోంది. తాజాగా చోటు చేసుకున్న కొన్ని ఘటనలు ఈ వాదనకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. శుక్రవారం ఐశ్వర్యారాయ్ పుట్టినరోజు. ఆమె పుట్టినరోజు నేపథ్యంలో సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు సామాజిక మాధ్యమాలు వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే ఐశ్వర్యారాయ్ భర్త అభిషేక్ బచ్చన్, మామ అమితాబ్ బచ్చన్ మాత్రం ఆమెకు శుభాకాంక్షలు తెలియజేయలేదు. ఇదే ఇప్పుడు శని వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
వీరిద్దరి మధ్య మనస్పర్ధలు ఉండడం వల్లే శుభాకాంక్షలు చెప్పేందుకు కూడా అభిషేక్ బచ్చన్ అంగీకరించ లేదంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వీరిద్దరూ వేరువేరుగా ఉంటున్నారంటూ పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమాల్లో చర్చ జరుగుతోంది. వీటికి బలాన్ని చేకూర్చేలా తాజా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ మధ్యకాలంలో ఐశ్వర్యారాయ్, అభిషేక్ బచ్చన్ కలిసి తిరిగిన ఫోటోలు కూడా ఎక్కడ కనిపించడం లేదు. ఆ మధ్య జరిగిన అనంత అంబానీ పెళ్లికి కూడా ఐశ్వర్యారాయ్ ఒక్కరే వచ్చారు. సాధారణంగా ఇటువంటి ఫంక్షన్లకు కుటుంబ సమేతంగా వస్తుంటారు. అప్పుడు కూడా ఐశ్వర్య ఒక్కరే రావడంతో కుటుంబంలో వివాదం నడుస్తుందంటూ ప్రచారం జరిగింది. పొద్దు నెలల కిందట అభిషేక్ బచ్చన్ కూడా తన భార్యను వదిలి ఒంటరిగా విదేశాలకు వెళ్ళాడు. దీంతో విడాకులకు సంబంధించిన గాసిప్స్ మరింత పెరిగాయి. తాజాగా తన భార్య పుట్టినరోజుకు శుభాకాంక్షలు కూడా అభిషేక్ బచ్చన్ చెప్పకపోవడంతో వీరిద్దరూ విడిపోవడం ఖాయమంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. గడిచిన ఏడాది కాలం నుంచి అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ వివాహ బంధంపై సందేహాలు తలెత్తుతూ వస్తున్నాయి. వీరి దాంపత్య జీవితానికి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున వివిధ రకాలుగా ప్రచారం జరుగుతున్న వీరు మాత్రం స్పందించకపోవడం గమనార్హం.