దీపావళి వేళ ఢిల్లీని కమ్మేసిన వాయు కాలుష్యం.. రికార్డు స్థాయిలో నమోదు

దీపావళి పండగ తర్వాత వాయు కాలుష్యం దేశ రాజధాని ఢిల్లీని కమ్మేసింది. ఊపిరి పీల్చుకోలేక ఢిల్లీలోని ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. దీపావళి తర్వాత ఢిల్లీ అంతట విషపూరిత పొగ మేఘాలు కమ్మేసాయి. ఢిల్లీలో ప్రస్తుతం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లో సగటున రూ.556 గా నమోదయింది. ఇది అత్యంత ఇబ్బందికరమైన పరిణామంగా నిపుణులు పేర్కొంటున్నారు. బాణాసంచా పేలుళ్ల తర్వాత ఢిల్లీ - ఎన్సీఆర్ గ్యాస్ సాంబర్ గా మారింది.

Air pollution in Delhi

 ఢిల్లీని కమ్మేసిన వాయు కాలుష్యం

దీపావళి పండగ తర్వాత వాయు కాలుష్యం దేశ రాజధాని ఢిల్లీని కమ్మేసింది. ఊపిరి పీల్చుకోలేక ఢిల్లీలోని ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. దీపావళి తర్వాత ఢిల్లీ అంతట విషపూరిత పొగ మేఘాలు కమ్మేసాయి. ఢిల్లీలో ప్రస్తుతం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లో సగటున రూ.556 గా నమోదయింది. ఇది అత్యంత ఇబ్బందికరమైన పరిణామంగా నిపుణులు పేర్కొంటున్నారు. బాణాసంచా పేలుళ్ల తర్వాత ఢిల్లీ - ఎన్సీఆర్ గ్యాస్ సాంబర్ గా మారింది. ఢిల్లీలో బాణాసంచా పేలుళ్లు నిషేధం ఉన్నప్పటికీ గురువారం రాత్రి దీపావళి సందర్భంగా పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు. దీంతో నగరాన్ని పొగ మేఘాలు కొమ్ముకున్నాయి. ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 700 దాటింది. కొన్ని ప్రాంతాల్లో AQI500 దాటింది. ఢిల్లీలో సగటు AQI 556గా నమోదయింది. ఆనంద్ విహార్ లో 714, డిఫెన్స్ కాలనీలో 631, పట్ పర్ గంజ్ లో 513 AQI నమోదయింది. మొత్తం ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత చాలా దారుణమైన స్థితికి చేరుకుంది. 

వేట దీపావళి సందర్భంగా వారి కాలుష్యం తీవ్ర సమస్యగా మారుతుండడంతో ఢిల్లీలోని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పెద్ద ఎత్తున టపాసులు పేల్చడంతో గాలిలో అహానికరమైన రసాయనాలు పెరుగుతున్నాయి. దీనివల్ల కాలుష్యం అనేక రేట్లు పెరుగుతోంది. సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, ధూళి కణాలు ఉంటున్నాయి. ఇవి గాలిని మరింత విషపూరితంగా చేస్తున్నట్లు నిపుణులు చెబుతున్నాయి. అలాగే దీపావళి పండుగ తర్వాత ఢిల్లీలోని అనేక రోడ్లలో ఎక్కడ చూసినా చెత్త చెదారం కనిపించింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్