దేశంలో ఎయిర్ అంబులెన్స్ సేవలు.. 788 వాహనాల సరఫరాకు ఒప్పందం

దేశవ్యాప్తంగా ప్రమాదాలు బారిన పడి ఎంతోమంది సకాలంలో వైద్య సేవలు అందక మృతి చెందుతున్నారు. క్షతగాత్రులను అంబులెన్స్ లో ఆసుపత్రులకు తరలించడం అనేక చోట్ల ట్రాఫిక్ సమస్య వల్ల ఇబ్బంది అవుతుంది. దీనివల్ల ఎంతో మంది ప్రాణాలను కోల్పోతున్నారు. ఇటువంటి మరణాలను నియంత్రించేందుకు ఎయిర్ అంబులెన్స్ సేవలను దేశవ్యాప్తంగా తీసుకువచ్చేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏ మారుమూల ప్రాంతం నుంచి ఎక్కడికైనా రోడ్డుపై నిలువుగా టేక్ ఆఫ్, లాండింగ్ అయ్యే ఎయిర్ అంబులెన్స్ లో త్వరలో దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో అందుబాటులోకి రానున్నాయి.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

దేశవ్యాప్తంగా ప్రమాదాలు బారిన పడి ఎంతోమంది సకాలంలో వైద్య సేవలు అందక మృతి చెందుతున్నారు. క్షతగాత్రులను అంబులెన్స్ లో ఆసుపత్రులకు తరలించడం అనేక చోట్ల ట్రాఫిక్ సమస్య వల్ల ఇబ్బంది అవుతుంది. దీనివల్ల ఎంతో మంది ప్రాణాలను కోల్పోతున్నారు. ఇటువంటి మరణాలను నియంత్రించేందుకు ఎయిర్ అంబులెన్స్ సేవలను దేశవ్యాప్తంగా తీసుకువచ్చేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏ మారుమూల ప్రాంతం నుంచి ఎక్కడికైనా రోడ్డుపై నిలువుగా టేక్ ఆఫ్, లాండింగ్ అయ్యే ఎయిర్ అంబులెన్స్ లో త్వరలో దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో అందుబాటులోకి రానున్నాయి. తద్వారా ఈ తరహా అంబులెన్స్లను ప్రారంభించిన ప్రపంచంలోని కొద్ది దేశాలు జాబితాలో భారత్ తో చేరనుంది. దీనివల్ల రోగులను, ప్రమాద బాధితులను వాయు మార్గంలో అత్యంత వేగంగా ఆసుపత్రులకు చేరవేసేందుకు అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి ఐఐటి మద్రాస్ కేంద్రంగా పనిచేసే ఈ ప్లేన్ కంపెనీ అనే ఎలక్ట్రిక్ ఎయిర్ క్రాఫ్ట్ స్టార్ట్ దేశంలో ప్రముఖ ఎయిర్ అంబులెన్స్ సంస్థ ఇంటర్నేషనల్ క్రిటికల్ కేర్ ట్రాన్స్ఫర్ టీమ్ (ఐసిఏటిటి) తో 100 కోట్ల డాలర్ల మేర ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం ఆ సంస్థ 788 ఎలక్ట్రిక్ వర్టికల్ టేక్ ఆఫ్ లాండింగ్ ఎయిర్ అంబులెన్స్లను సరఫరా చేయనున్నది.

వీటిని దేశంలోని ప్రతి జిల్లాలో మోహరించినన్నారు. నమోదుకా గ్రహీతల్లో దాదాపు 95 శాతం మంది సకాలంలో అవయవాలు పొందక మరణిస్తున్న నేపథ్యంలో అతి తక్కువ సమయంలో అవయవాలు, ఔషధాలు తరలించేందుకు వీటిని ఉపయోగించనున్నారు. 2026 చివరి ప్రైమాస్కం నాటికి ఎయిర్ అంబులెన్స్ల కార్యకలాపాలు ప్రారంభించాలని ఈప్లేన్ కంపెనీ ఎలక్షన్ గా పెట్టుకుంది. తమ సంస్థకు ఏడాదికి 100 యూనిట్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందని కంపెనీ వ్యవస్థాపకుడు సత్య చక్రవర్తి పేర్కొన్నారు. ఎయిర్ అంబులెన్స్ల ఒప్పందం పూర్తయినప్పటికీ ఇతర రకాల ఈవీటివోఎల్ ఎయిర్ క్రాఫ్ట్లను తయారు చేసేందుకు, పరీక్షించేందుకు, అవసరమైన సర్టిఫికేషన్ పొందేందుకు మరో 10 కోట్ల డాలర్ల నిధులను ఆయన ఆశిస్తున్నారు. ఇప్పటివరకు ఈ ప్లేన్ కంపెనీ రెండు కోట్ల డాలర్ల వరకు పెట్టుబడిదారుల నుంచి సేకరించింది. ఈ ప్లేన్ కంపెనీ ప్రస్తుతం వివిధ రకాల బౌగోళిక పరిస్థితులు, జనాభా సాంద్రతల అవసరాల ఆధారంగా మూడు రకాల ఎయిర్ అంబులెన్స్ నమూనాలపై పనిచేస్తుంది. ఈ అంబులెన్స్ లో ఒక పైలట్, ఒక పారామెడిక్, స్ట్రెచర్ ఉంటాయి. ఇంకా రోగికి అత్యవసర సమయంలో అవసరమైన వైద్య పరికరాలు, మెడికల్ కిట్లు ఇందులో ఉండేలా తయారు చేయనున్నారు. గరిష్టంగా గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం ఉంటుంది. ఒకసారి బ్యాటరీ రీఛార్జ్ చేస్తే 100 నుంచి 200 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించవచ్చు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్