ఇందిరమ్మ ఇళ్లపై కీలక అప్డేట్.. అర్హులకు అందరికీ ఇల్లు ఇచ్చేలా సీఎం కీలక ఆదేశాలు

తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అర్హులందరికీ ఇల్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలంటూ సీఎం ఆదేశించారు. అనర్హులకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇల్లు దక్కకూడదని కీలక ఆదేశాలను సీఎం అధికారులకు ఇచ్చారు. పేదలందరికీ ఇల్లు ఇస్తామని గతంలోనే రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుపేదలందరికీ ఇళ్లను కట్టించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అర్హులందరికీ ఇల్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలంటూ సీఎం ఆదేశించారు. అనర్హులకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇల్లు దక్కకూడదని కీలక ఆదేశాలను సీఎం అధికారులకు ఇచ్చారు. పేదలందరికీ ఇల్లు ఇస్తామని గతంలోనే రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుపేదలందరికీ ఇళ్లను కట్టించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తోంది. అయితే ఇప్పటికి కూడా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించలేదు. దీంతో అర్హులైన నిరుపేదల్లో ప్రభుత్వం పట్ల అసహనం వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి తాజాగా కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు. కొత్తగా కొన్ని నిబంధనాలను తీసుకువచ్చారు. ఈ నిబంధనలు ప్రకారం ఇప్పటివరకు వివిధ పథకాల రూపంలో ఇల్లు దక్కించుకున్న వాళ్లు ఎవరూ కూడా కొత్తగా ఇంటి కోసం దరఖాస్తు చేయకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. సాంకేతిక ఇబ్బందుల వల్ల పొరపాటున ఇదివరకు లబ్ధి పొందిన వారికి ఇల్లు కేటాయించిన వాటిని తిరిగి తీసుకునే ఛాన్స్ ఉంటుందని ప్రభుత్వ స్పష్టం చేసింది. ఈ విషయంలో ఇప్పటికే లబ్ధి పొందిన అర్హులు మాత్రం జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం నుంచి ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. 

గత ప్రభుత్వ హయాంలో ఎంతోమంది ఇళ్ల లబ్ధి పొందినప్పటికీ చాలామంది మరోసారి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇచ్చే ఇల్లు కోసం ప్రయత్నాలు సాగిస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం అప్రమత్తమైనట్లు చెబుతున్నారు. ప్రభుత్వం త్వరలోనే గ్రామ సభలో నిర్వహించి లబ్ధిదారుల పేర్లను ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఎందుకు సంబంధించి ఆధార్ వివరాలను కూడా లెక్కలోకి తీసుకుంటుంది ప్రభుత్వం. ఇప్పటికే ఇల్లు పొందిన వారి జాబితా మొత్తం ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి దగ్గరకు చేరింది. ఈమధ్య ఈ లిస్టును అధికారులు సీఎంకు ఇచ్చారు. ఇప్పుడు ఈ లిస్టులో పేర్లు ఉంటే కొత్తగా వారికి ఎవరని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో మరో సమస్య కూడా ఉత్పన్నమవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించగా.. ఇప్పుడు హడ్కో రూల్స్ ప్రకారం ఆ ఇల్లు డిజైన్లు మార్చాల్సిన పరిస్థితి వస్తోంది. హడ్కో సంస్థ ఇళ్ల నిర్మాణానికి 8 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు అంగీకరించింది. కానీ ఇళ్ల నిర్మాణం డబుల్ బెడ్ రూమ్ మాదిరిగా ఉండకూడదని షరతు పెట్టింది. ఇప్పుడు ఆ సంస్థ చెప్పినట్టుగా ఇల్లు నిర్మించాల్సి ఉంటుంది. ఇది ప్రభుత్వానికి సవాల్ గా మారనుంది. ఏది ఏమైనప్పటికీ లబ్ధిదారులకు ఇల్లు అందించడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్త ఏడాది తొలి మూడు నెలల్లోనే మొదటి విడతలో ఇల్లు నిర్మాణ ప్రక్రియను ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్