గోదావరి నది ఉగ్రరూపం దాల్చుతోంది. దీంతో భద్రాచలం వద్ద వరద ఉధృతి మళ్లీ పెరుగుతోంది.
ఏలూరు, ఈవార్తలు : గోదావరి నది ఉగ్రరూపం దాల్చుతోంది. దీంతో భద్రాచలం వద్ద వరద ఉధృతి మళ్లీ పెరుగుతోంది. దీంతో గోదావరి నదీ తీర ప్రాంతాల్లో ఉన్న కుక్కునూరు, వేలేరుపాడు మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. గ్రామల ప్రజలు ఎవరూ నదిలోకి వెళ్లవద్దని ఆదేశించారు. ఇదిలా ఉండగా, తెలంగాణ జలపాతాల సందర్శనపై ఆ రాష్ట్రప్రభుత్వం నిషేధం విధించింది. జలపాతాలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో, సందర్శకులు ప్రమాదాల బారిన పడుతున్నారని, తాజాగా ఓ విద్యార్థి మృతి చెందిన వైనాన్ని గుర్తుచేస్తూ అధికారులు జలపాతాల సందర్శనను తాత్కాలికంగా బ్యాన్ చేశారు.
ముఖ్యంగా తెలంగాణ నయాగర అయిన బొగత జలపాతాలకు నో ఎంట్రీ బోర్డు పడింది. జలపాతం అత్యంత ప్రమాదకరంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో అటవీశాఖ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. వరద ఉధృతి తగ్గేవరకు బొగతకు రావొద్దని ఆంక్షలు విధించారు.