బన్నీ ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి.. లేదంటే తోలు తీస్తామంటూ హెచ్చరించిన ఏసీపీ విష్ణుమూర్తి

అల్లు అర్జున్‌పై తెలంగాణ పోలీసులు తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు. శనివారం అసెంబ్లీలో సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడిన మాటలకు కౌంటర్‌గా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి అనేక విషయాలను వెల్లడించిన హీరో అల్లు అర్జున్‌పై తెలంగాణ పోలీసులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆదివారం సాయంత్రం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఏసీపీ విష్ణు మూర్తి అల్లు అర్జున్‌కు స్ర్టాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. అల్లు అర్జున్‌ ఏమాత్రం బాధ్యతగా ప్రవర్తించలేదన్న విష్ణు మూర్తి.. ఇష్టం వచ్చినట్టు ప్రెస్‌మీట్లు పెట్టి పోలీసులపై తప్పుడు ప్రచారం చేయొద్దంటూ హితవు పలికారు.

Allu Arjun, ACP Vishnu Murthy

అల్లు అర్జున్‌, ఏసీపీ విష్ణు మూర్తి

అల్లు అర్జున్‌పై తెలంగాణ పోలీసలు తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు. శనివారం అసెంబ్లీలో సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడిన మాటలకు కౌంటర్‌గా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి అనేక విషయాలను వెల్లడించిన హీరో అల్లు అర్జున్‌పై తెలంగాణ పోలీసులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆదివారం సాయంత్రం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఏసీపీ విష్ణు మూర్తి అల్లు అర్జున్‌కు స్ర్టాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. అల్లు అర్జున్‌ ఏమాత్రం బాధ్యతగా ప్రవర్తించలేదన్న విష్ణు మూర్తి.. ఇష్టం వచ్చినట్టు ప్రెస్‌మీట్లు పెట్టి పోలీసులపై తప్పుడు ప్రచారం చేయొద్దంటూ హితవు పలికారు. పోలీసులెవరూ ఫ్యాన్స్‌కు చేతులు ఊపుతూ అభివాదం చేయమని చెప్పలేదని, ఆయన ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నాడని విమర్శించారు. ఇద్దరు మనుషులు అక్కడ శవాల్లాగా పడి ఉంటే పట్టించుకోకుండా వెళ్లిపోయాడంటూ అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటన తరువాత అల్లు అర్జున్‌ చాలా సక్సెస్‌ మీట్లు పెట్టుకున్నాడని, ఆయనకు కొంచెమైనా సామాజిక బాధ్యత ఉందా..? అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చట్టానికి విరుద్ధంగా ప్రెస్‌మీట్లు పెట్టినందుకు కోర్టులో అల్లు అర్జున్‌కు బెయిల్‌ రాకుండా చేయాలి అంటూ పేర్కొన్నారు. అల్లు అర్జున్‌ ఏమైనా తీస్‌మార్‌ ఖాన్‌ అనుకుంటున్నాడా..? అంటూ ప్రశ్నించిన విష్ణు మూర్తి.. అసలు బన్నీకి తెలంగాణలో ఆధార్‌ కార్డు ఉందా..? అని ప్రశ్నించారు. పోలీసు అధికారులు తనకు చెప్పలేదని చెబుతున్నారని, నీకు చెప్పాల్సి అవసరం ఉందన్నారు.

నువు ఏమన్నా తీస్‌మార్‌ఖాన్‌ అనుకుంటున్నావా.? నువ్వు సాధారణ పౌరుడివి కావా? అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేవారు. అసెంబ్లీలో నీ వల్ల గంట సమయం పోయిందని, నీ గురించి తామెందుకు బాధపడాలంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణ సమాజం సౌమ్యులు కాబట్టి ఇక్కడ ఇంకా నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. సినిమా వాళ్ల దాదాగిరి ఏంటీ.? ఇష్టమొచ్చినట్టు టికెట్‌ రేట్లు పెంచారని విమర్శించారు. కోట్లు పెట్టి సినిమాలు తీయమని తాము బతిలాడామా.? అంటూ నిలదీశారు. సున్నితంగా హెచ్చరించేందుకు తాను ఇక్కడకు వచ్చానన్నారు. పోలీసులు, వారి కుటుంబాలు ఒక్కసారి అడ్డం తిరిగితే ఏం జరుగుతుందో మీకు తెలియదని హెచ్చరించారు. పోలీసులపై నోరుపారేసుకోవడం బంద్‌ చేయాలన్నారు. తమ విచారణ సరిగా లేకపోతే చట్టం ముందుకు వెళ్లి రద్దు చేయించుకోవాలన్నారు. అడ్డ, దిడ్డంగా పోలీసులు మీదకు వస్తే రీల్స్‌ కట్‌ అవుతాయని హెచ్చరించారు. ఇదిలా ఉంటే హైదరాబాద్‌లోని అల్లు అర్జున్‌ ఇంటిని ఓయూ జేఏసీ నాయకులు ముట్టడించారు. ఇంటి గోడలు ఎక్కి రాళ్లు విసిరారు. సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనలో రేవతి కుటుంబాన్ని ఆదుకోవాలని నినాదాలు చేశారు. ఇంటి లోపలకు వెళ్లేందుకు యత్నించగా అక్కడి సిబ్బంది అడ్డుకున్నారు. రేవతి చావుకు అల్లు అర్జునే కారణమంటూ నినాదాలు చేశారు. బాధిత కుటుంబానికి కోటి పరిహారం ప్రకటించాలంటూ డిమాండ్‌ చేశారు. అల్లు అర్జున్‌ ఇంటి ముందుకు కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు అక్కడకు చేరుకుని ఆందోళనకారులను అరెస్ట్‌ చేశారు. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్