విశాఖను వదలని ప్రమాదాలు.. శ్రావణ్ షిప్పింగ్స్ లో విషవాయువు పీల్చడంతో ఐదుగురు కార్మికులకు తీవ్ర అస్వస్థత

ఉమ్మడి విశాఖ జిల్లాలో గడచిన కొద్ది రోజుల నుంచి వరుసగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. విభజిత అనకాపల్లి జిల్లాలో కొద్దిరోజుల కిందట ఎసెన్షియ ఫార్మ పరిశ్రమలో పేలుడు సంభవించి 17 మంది మృతి చెందారు. ఆ తరవాత జరిగిన మరో పరిశ్రమలోనూ ప్రమాదం సంభవించడంతో ఐదుగురు తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.

Collector visiting the victims and others

బాధితులను పరామర్శిస్తున్న కలెక్టర్ తదితరులు

ఉమ్మడి విశాఖ జిల్లాలో గడచిన కొద్ది రోజుల నుంచి వరుసగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. విభజిత అనకాపల్లి జిల్లాలో కొద్దిరోజుల కిందట ఎసెన్షియ ఫార్మ పరిశ్రమలో పేలుడు సంభవించి 17 మంది మృతి చెందారు. ఆ తరవాత జరిగిన మరో పరిశ్రమలోనూ ప్రమాదం సంభవించడంతో ఐదుగురు తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలు జరిగే రెండు వారాలు గడవక ముందే మరో ప్రమాదం శుక్రవారం రాత్రి విశాఖలో చోటుచేసుకుంది. శ్రావణ్ షిప్పింగ్స్ సంస్థలో శుక్రవారం జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో హుటాహుటిన కిమ్స్ ఐకాన్ ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్య సేవలను అందిస్తున్నారు. ఎసిటానిలైడ్ బ్యాగ్స్ ను ఒక కంటైనర్ నుంచి మరో కంటైనర్ కు మార్చుతుండగా ప్రమాదం చోటు చేసుకున్నట్టు చెబుతున్నారు. ఎసిటానిలైడ్ అనే విష వాయువును పీల్చటంతో ఐదుగురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వీరికి మెరుగైన వైద్యం అందించేలా చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఘటన జరిగినప్పటి నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని కలెక్టర్ సమీక్షిస్తున్నారు. 

తెల్లవారుజాము రెండు గంటలకు ఆసుపత్రికి తరలింపు..

ఎసిటానిలైడ్ అనే విషవాయువు లీక్ కాగా, దానిని పీల్చి ఐదుగురు కార్మికులు ఆస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారిని హుటాహుటిన గాజువాక సింహగిరి ఆసుపత్రికి తరలించి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మెరుగైన చికిత్స నిమిత్తం రాత్రి రెండు గంటల సమయంలో కిమ్స్ ఐకాన్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో గునుపూరు రాము, లక్ష్మి, లత, కుమారి, దేముడు బాబు అస్వస్థతకు గురైనట్టు అధికారులు చెబుతున్నారు. వీరంతా కోరుకుంటున్నట్టు అధికారులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న వెంటనే జిల్లా కలెక్టర్ తో పాటు నగర పోలీస్ కమిషనర్ ఇతర అధికారి యంత్రాంగం ప్రమాదం జరిగిన శ్రావణ్ షిప్పింగ్ సంస్థ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్న తర్వాత బాధితులు చికిత్స పొందుతున్న కిమ్స్ ఐకాన్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ బాధితులను పరామర్శించి వారికి అందుతున్న వైద్య సేవలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాల్సిందిగా సూచించారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్