ఐదు, ఎనిమిది తరగతులకు నోడిటెన్షన్ విధానం రద్దు.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. విద్య హక్కు చట్టం -2019 కు చేసిన సవరణ ప్రకారం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఈ సవరణలో పేర్కొన్న విధంగా ఐదు, ఎనిమిది తరగతులకు నో డి టెన్షన్ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీని ప్రకారం ఐదు, ఎనిమిది తరగతుల విద్యార్థులు పరీక్షలు ఫెయిల్ అయితే వారిని ఆటోమేటిక్గా పై తరగతులకు ప్రమోట్ చేయరు. అలాగే బడి మానిపించడం, తీసి ఇచ్చి ఇంటికి పంపించడం వంటివి ఉండవు.

 symbolic image

ప్రతీకాత్మక చిత్రం

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. విద్య హక్కు చట్టం -2019 కు చేసిన సవరణ ప్రకారం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఈ సవరణలో పేర్కొన్న విధంగా ఐదు, ఎనిమిది తరగతులకు నో డి టెన్షన్ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీని ప్రకారం ఐదు, ఎనిమిది తరగతుల విద్యార్థులు పరీక్షలు ఫెయిల్ అయితే వారిని ఆటోమేటిక్గా పై తరగతులకు ప్రమోట్ చేయరు. అలాగే బడి మానిపించడం, తీసి ఇచ్చి ఇంటికి పంపించడం వంటివి ఉండవు. సదరు తరగతుల తుది పరీక్ష ఫలితాలు విడుదలైన తరువాత రెండు మాసాల మధ్య ఫెయిల్ అయిన విద్యార్థులకు పునః పరీక్షలు నిర్వహిస్తారు. వాటిలోనూ విద్యార్థులు మళ్ళీ ఫెయిల్ అయితే అదే క్లాసుల్లో వారిని కొనసాగించనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు రెండు మాసాల వ్యవస్థలో టీచర్లు, తల్లిదండ్రులు వారిని మరింత గైడ్ చేయాలని సూచించింది. ఏ ఒక్క విద్యార్థి ప్రాథమిక విద్య పూర్తయ్యే వరకు పాఠశాలకు దూరం కాకూడదన్నదే సవరణ చట్టం ప్రధాన ఉద్దేశం గా కేంద్ర ప్రభుత్వం తాజా గెజిట్లో పేర్కొంది. కాగా 5, 8 తరగతులకు ఇప్పటికే ఈ సవరణ చట్టాన్ని దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలు అమలు చేస్తున్నాయి. తాజా ఉత్తర్వులు దేశంలోని 3 వేలకు పైగా ఉన్న కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, సైనిక స్కూళ్లు సహా కేంద్రం ఆధ్వర్యంలోని పాఠశాలలకు వర్తించనున్నట్లు సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. విద్యా రాష్ట్రాల జాబితాలో ఉన్నందున ఆయా రాష్ట్రాలు ఈ విషయంపై నిర్ణయం తీసుకునే వెసులుబాటు కల్పించింది కేంద్ర ప్రభుత్వం. ఇదిలా ఉంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నో డి టెన్షన్ విధానం కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ విధానం వల్ల విద్యార్థులకు మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్