ఢిల్లీ ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేసిన ఆప్.. కీలక డిమాండ్లతో బిజెపికి సవాల్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం దక్కించుకోవడమే లక్ష్యంగా అధికారంలో ఉన్న ఆప్, అధికారం కోసం పరితపిస్తున్న కాంగ్రెస్ పార్టీ, బిజెపి సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బుధవారం మధ్యాహ్నం ఆప్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. మధ్య తరగతి ప్రజలను ఆకట్టుకునేలా ఏడు అంశాలతో ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే కేంద్ర వార్షిక బడ్జెట్లో మధ్యతరగతి ప్రజలకు మేలు చేసేలా ఉండాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఆప్ సంధించిన కీలక డిమాండ్లలో ఇవి ఉన్నాయి.

Arvind Kejriwal speaking

మాట్లాడుతున్న అరవింద్ కేజ్రీవాల్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం దక్కించుకోవడమే లక్ష్యంగా అధికారంలో ఉన్న ఆప్, అధికారం కోసం పరితపిస్తున్న కాంగ్రెస్ పార్టీ, బిజెపి సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బుధవారం మధ్యాహ్నం ఆప్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. మధ్య తరగతి ప్రజలను ఆకట్టుకునేలా ఏడు అంశాలతో ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే కేంద్ర వార్షిక బడ్జెట్లో మధ్యతరగతి ప్రజలకు మేలు చేసేలా ఉండాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఆప్ సంధించిన కీలక డిమాండ్లలో ఇవి ఉన్నాయి. ఇందులో మొదటిది కేంద్ర బడ్జెట్లో ఎడ్యుకేషన్ కేటాయింపులను రెండు శాతం నుంచి 10 శాతానికి పెంచాలి. ప్రైవేట్ స్కూల్ ఫీజులు ప్రభుత్వ నియంత్రణలో ఉండేలా చర్యలు తీసుకోవాలి. రెండోది ఉన్నత విద్య చదివే ప్రతి ఒక్కరికి సబ్సిడీలు, స్కాలర్షిప్ అందించాలి. మూడోది హెల్త్ బడ్జెట్ ను 10 శాతానికి పెంచాలి. ఆరోగ్య భీమా ప్రీమియం చెల్లింపులపై పన్ను రద్దు చేయాలి. నాలుగోది ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని ప్రస్తుత రూ.7 లక్షల నుంచి పది లక్షలకు పెంచాలి. ఐదోది నిత్యవసర సరుకులపై జిఎస్టి ఎత్తివేయాలి. ఆరోది సీనియర్ సిటిజనులకు బలమైన రిటైర్మెంట్ ప్లాన్, పెన్షన్ స్కీమ్స్ ను తీసుకురావాలి. ఏడోది దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో సీనియర్ సిటిజనులకు ఉచిత వైద్య సదుపాయాన్ని కల్పించాలి. దేశవ్యాప్తంగా రైలు ప్రయాణ టికెట్లలో సీనియర్ సిటిజనులకు 50 శాతం రాయితీ కల్పించాలి. ఈ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చాలని అరవింద్ కేజ్రీవాల్ సూచించారు. 

మధ్యతరగతి ప్రజలను కాపాడేందుకు వినియోగిస్తున్నామన్న అరవింద్ కేజ్రీవాల్..

కేంద్రానికి 7 ప్రధానమైన డిమాండ్లను చేసిన అరవింద్ కేజీలు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. పన్నుల ద్వారా వచ్చే సొమ్మును విద్యతోపాటు ద్రవ్యోల్బణం నుంచి మధ్యతరగతి వారిని కాపాడేందుకు తాము వినియోగిస్తున్నట్లు ఈ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. విద్యుత్ చార్జీలు, నీటి చార్జీలను తగ్గించడంతోపాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులను పెంచినట్టు వివరించారు. ఆమ్ ఆద్మీ పార్టీ మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో ఢిల్లీ సీఎం అతిషి కూడా పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీలో బిజెపి నేతలు రౌడీయిజం చేస్తున్నారంటూ అతిషి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 

ఇదిలా ఉంటే ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఫిబ్రవరి 5వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. డబ్బు స్థానాల్లో మొత్తంగా 699 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. గడిచిన ఎన్నికలతో పోలిస్తే ఈసారి అసెంబ్లీ ఎన్నికల బారిలో నిలుస్తున్న అభ్యర్థుల సంఖ్య గణనీయంగా జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేస్తున్న న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మొత్తంగా 23 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక్కడ నుంచి బిజెపి అభ్యర్థి పర్వేష్ వర్మ, కాంగ్రెస్ పార్టీ నుంచి సందీప్ దీక్షిత్ పోటీ చేస్తున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గ ఇదే కావడం గమనార్హం. ఫిబ్రవరి 5వ తేదీన ఎన్నిక జరగనుండగా, ఎనిమిదో తేదీన వాట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్