ప్రేమోన్మాది దాడిలో యువతి మృతి.. గచ్చిబౌలిలో చోటుచేసుకున్న ఘటన

హైదరాబాదులోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమోన్మాది దాడిలో ఒక యువతి మృతి చెందింది. ఈ ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. గోపన్ పల్లి తండాలో ప్రేమ ఉన్నదీ దాడిలో యువతి దీపన తమాంగ్ (25) మృతి చందగా మరో ముగ్గురుకి గాయాలయ్యాయి. బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.

young woman died

యువతి మృతి

హైదరాబాదులోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమోన్మాది దాడిలో ఒక యువతి మృతి చెందింది. ఈ ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.  గోపన్ పల్లి తండాలో ప్రేమ ఉన్నదీ దాడిలో యువతి దీపన తమాంగ్ (25) మృతి చందగా మరో ముగ్గురుకి గాయాలయ్యాయి. బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని బీదర్ కు చెందిన రాకేష్ మాదాపూర్ లోని ఒక ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్నాడు. పశ్చిమ బెంగాల్ కు చెందిన దీపన తమాంగ్ నల్లగుండ్లలో బ్యూటీషియన్ గా పని చేస్తోంది. ఆమె గోపనపల్లి తండా సమీపంలో స్నేహితులతో కలిసి నివాసం ఉంటుంది. ఈ క్రమంలోనే రాకేష్ తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఇద్దరూ సన్నిహితంగా ఉంటూ వచ్చారు. ఈ సాన్నిహిత్యాన్ని ప్రేమగా భావించిన రాకేష్ తనను పెళ్లి చేసుకోవాలంటూ ఏడాదిగా ఆమెను వేధిస్తూ వచ్చాడు. దీనికి దీపన నిరాకరించింది.

అయినప్పటికీ రాకేష్ ఆమె వెంటపడి పెళ్లి చేసుకోవాలంటూ వేధింపులకు గురి చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి ఆమె ఇంటికి రాకేష్ వెళ్ళాడు. ఇద్దరి మధ్య వాదోపవాదనలు జరిగాయి. తనని పెళ్లి చేసుకోవాలంటూ అల్టిమేటం జారీ చేశాడు. పెళ్లి చేసుకోవడం కుదరదని, ఇంట్లో అంగీకరించారని దీపన చెప్పింది. ఏ రోజు పెళ్లి చేసుకుంటానని చెప్పలేదంటూ రాకేష్ కు స్పష్టం చేసింది. దీంతో ఇరువురు మధ్య మరింత వాగ్వాదం పెరిగింది. తీవ్ర ఆవేశానికి గురైన రాకేష్ అక్కడే ఉన్న కూరగాయల కత్తితో దీపనపై దాడి చేశాడు. దీంతో దీపన అక్కడికక్కడే మృతి చెందింది. అడ్డుకునేందుకు ప్రయత్నించిన దీపన స్నేహితులపైనా దాడికి పాల్పడ్డాడు రాకేష్. అనంతరం అక్కడ నుంచి వెళ్లి మొయినాబాద్ సమీపంలోని కనకమామిడి వద్ద ఆత్మహత్యకు ప్రయత్నించాడు. విద్యుత్ స్తంభం ఎక్కేందుకు ఎక్కించడంతో షాక్ కు గురై తీవ్రంగా గాయాల పాలయ్యాడు. స్థానికులు సమాచారంతో అక్కడికి చేరుకున్న గచ్చిబౌలి పోలీసులు రాకేష్ ను ఆసుపత్రికి తరలించే చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రాకేష్ దాడిలో గాయపడిన దీపన స్నేహితులకు కూడా ఆసుపత్రిలో చేర్పించి పోలీసులు వైద్య సేవలు అందిస్తున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్