కువైట్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 41 మంది భారతీయులు సజీవ దహనం

కువైట్ లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 35 మంది ప్రాణాలు కోల్పోయారు. కువైట్ లోని మంగఫ్ లో గల అపార్ట్మెంట్ లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 35 మంది మృతి చెందగా వీరిలో ఐదుగురు భారతీయులు కూడా ఉన్నట్లు చెబుతున్నారు.

Smoke and flames

కమ్మేసిన పొగ, మంటలు


కువైట్ లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 35 మంది ప్రాణాలు కోల్పోయారు. కువైట్ లోని మంగఫ్ లో గల అపార్ట్మెంట్ లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 35 మంది మృతి చెందగా వీరిలో ఐదుగురు భారతీయులు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. వీళ్లంతా కేరళకు చెందిన వాళ్ళుగా చెబుతున్నారు. కువైట్ న్యూస్ ఏజెన్సీ ఈ విషయాన్ని బయటకు వెల్లడించింది. ఒక బిల్డింగ్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగి ప్రమాదానికి కారణమైనట్లు తెలుస్తోంది. మంటలు భవనమంత వ్యాప్తి చెంది ప్రమాద తీవ్రతను పెంచాయి. భవనం లోపల చాలామంది చిక్కుకున్నారు. మంటలను స్థానిక అగ్నిమాపక శాఖ అధికారులతోపాటు విపత్తు నిర్వహణ విభాగానికి చెందిన అధికారులు అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. అయితే మంటలు అదుపులోకి వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆరంతస్తుల బిల్డింగ్ లో ఈ ప్రమాదం జరిగింది. కిచెన్లోని మంటలు చెలరేగి వ్యాప్తి చెందినట్లు తెలుస్తోంది. తెల్లవారుజామున నాలుగు 30 గంటలకు ప్రమాదం జరగా తర్వాత కాసేపటికి అపార్ట్మెంట్లోని అనేక అంతస్తులకు ఈ మంటలు వ్యాప్తి చెందాయి. వెంటనే అప్రమత్తమైన కొందరు బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలోనే మంటల్లో చిక్కుకొని అనేక మంది ఆహుతి అయినట్లు తెలుస్తోంది. మరి కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ఇంకొంత మంది శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా వెల్లడించింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్