నైజీరియాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పెట్రోల్ ట్యాంకర్ పేలి 70 మంది వరకు మరణించినట్లు తెలుస్తోంది. నైజర్ ప్రావిన్స్ లోని సురేజా ప్రాంతానికి సమీపంలో శనివారం కొందరు జనరేటర్ ఉపయోగించి ఒక ట్యాంకర్ నుంచి మరో ట్రక్కుకు గ్యాసోలిన్ బదిలీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సమయంలోనే పేలుడు సంభవించిందని స్థానిక అధికారులు వెల్లడించారు. ఇంధన బదిలీ జరుగుతున్న సమయంలో పేలుడు సంభవించి గ్యాసోలిన్ బదిలీ చేస్తున్నవారు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది.
ప్రమాదంలో కాలిపోతున్న ట్యాంకర్
నైజీరియాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పెట్రోల్ ట్యాంకర్ పేలి 70 మంది వరకు మరణించినట్లు తెలుస్తోంది. నైజర్ ప్రావిన్స్ లోని సురేజా ప్రాంతానికి సమీపంలో శనివారం కొందరు జనరేటర్ ఉపయోగించి ఒక ట్యాంకర్ నుంచి మరో ట్రక్కుకు గ్యాసోలిన్ బదిలీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సమయంలోనే పేలుడు సంభవించిందని స్థానిక అధికారులు వెల్లడించారు. ఇంధన బదిలీ జరుగుతున్న సమయంలో పేలుడు సంభవించి గ్యాసోలిన్ బదిలీ చేస్తున్నవారు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. చుట్టుపక్కల ఉన్న వాళ్లు కూడా ఎంతోమంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీకి చెందిన హుస్సేని ఇషా ఇదే విషయాన్ని ధ్రువీకరించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తిస్థాయి విచారణ కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. నైజర్ గవర్నర్ మహమ్మద్ బాగో ఈ ప్రమాద ఘటనకు సంబంధించి ఒక ప్రకటనను విడుదల చేశారు. రాష్ట్రంలోని డికో ప్రాంతంలోని అనేకమంది నివాసితులు పెట్రోల్ ట్యాంకర్ నుండి ఇంధనాన్ని తీసివేయడానికి ప్రయత్నిస్తుండగా భారీ మంటల్లో చిక్కుకున్నారని వెల్లడించారు. చాలామంది కాలిపోయారని బాగో పేర్కొన్నారు. ట్యాంకర్ కు అంత దగ్గరగా లేని వాళ్ళు గాయపడిన ప్రాణాలతో బయటపడ్డారని వెల్లడించారు.
ఈ సంఘటనను ఆయన ఆందోళనకరమైన, హృదయ విదారకమైన ఘటనగా అభివర్ణించారు. ఈ ప్రమాద ఘటనలో సుమారు 70 మంది వరకు మరణించారని స్థానిక వార్తాపత్రిక దిన్యాసం వెల్లడించింది. నైజర్ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక మానవతా సంస్థలకు ఈ సవాల్ ను స్వీకరించి ఈ ప్రాంతంలో సాధారణ స్థితిని పునరుద్ధరించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చింది. నైజీరియాలో పెట్రోల్ ట్యాంకర్ పేలుళ్లు సాధారణంగా జరుగుతుంటాయి. తరచూ భారీ ప్రాణ నష్టం జరుగుతున్న, దేశ వ్యాప్తంగా శోకసంద్రమైన పరిస్థితులు నెలకొంటున్నప్పటికీ మార్పులు రాకపోవడం గమనార్హం. గడిచిన ఏడాది సెప్టెంబర్ లో కూడా ఇదే తరహాలో ప్రమాదం చోటుచేసుకుంది. నైజర్ లోని రద్దీగా ఉండే హైవేపై పెట్రోల్ ట్యాంకర్ 48 మంది మరణించారు. పడిపోయిన ట్యాంకర్ లో నుంచి గ్యాసోలిన్ తీసేందుకు ప్రయత్నించి ఈ తరహా ప్రమాదాల బారిన పడుతున్నారు. దేశంలో కొనసాగుతున్న ఆర్థిక ఇబ్బందులే ఈ తరహా పనులకు ప్రజలను ప్రేరేపిస్తున్నాయని, ఇటువంటి చర్యలకు పాల్పడిన ప్రతిసారి ప్రమాదాలు వారిని పడుతున్నారని ప్రజలు వాపోతున్నారు. అక్టోబర్లో నైజీరియా అధ్యక్షుడు బోలా టినుబు ఇంధన రవాణా, భద్రత ప్రోటోకాల్ ను అత్యవసరంగా సమీక్షించి మెరుగుపరచడానికి ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటించారు. గస్తీని పెంచాలని, భద్రతా నియమాలను కఠినంగా అమలు చేయాలని, అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిరోధించాలని పోలీసులను ఆదేశించారు. ఇతర హైవే భద్రతా యంత్రాంగాల వంటి చర్యలను బలోపేతం చేశారు. అయినప్పటికీ మరోసారి ఇటువంటి ప్రమాదం చోటు చేసుకోవడం అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది.
[09:29, 1/19/2025] Bs Naidu: క్యా