గేమర్ల కోసం ప్రత్యేకంగా స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి రాబోతోంది. రెడ్ మ్యాజిక్ 10 సిరీస్ లోని కొత్త స్మార్ట్ ఫోన్ REDMAZIC 10 Air చైనా మార్కెట్లో ఏప్రిల్ 16న అధికారికంగా విడుదల అయింది. ఈ విషయాన్ని ఇప్పటికే కంపెనీ వెల్లడించింది. తాజాగా ఈ ఫోన్కు సంబంధించిన డిజైన్లను మూడు ఆకర్షణీయమైన కలర్స్లో మార్కెట్లోకి ఈ సంస్థ విడుదల చేసింది. ఇవి షాడో బ్లాక్, ప్రోస్ట్ బ్లేడ్ వైట్, ఫ్లేమ్ ఆరెంజ్ రంగుల్లో ఉంటాయని రెడ్ మ్యాజిక్ వెల్లడించింది. ఈ ఫోన్కు సంబంధించిన రెడ్ మ్యాజిక్ సీఈవో ఇప్పటికే దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ స్మార్ట్ ఫోన్ పొడవుగా, బలంగా ఉండేలా డిజైన్ చేయబడిందని పేర్కొన్నారు. దీనిని ఒకసారి చేతిలో పట్టుకుంటే వదలటం కష్టమని ఆయన వెల్లడించారు.
ప్రతీకాత్మక చిత్రం
గేమర్ల కోసం ప్రత్యేకంగా స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి రాబోతోంది. రెడ్ మ్యాజిక్ 10 సిరీస్ లోని కొత్త స్మార్ట్ ఫోన్ REDMAZIC 10 Air చైనా మార్కెట్లో ఏప్రిల్ 16న అధికారికంగా విడుదల అయింది. ఈ విషయాన్ని ఇప్పటికే కంపెనీ వెల్లడించింది. తాజాగా ఈ ఫోన్కు సంబంధించిన డిజైన్లను మూడు ఆకర్షణీయమైన కలర్స్లో మార్కెట్లోకి ఈ సంస్థ విడుదల చేసింది. ఇవి షాడో బ్లాక్, ప్రోస్ట్ బ్లేడ్ వైట్, ఫ్లేమ్ ఆరెంజ్ రంగుల్లో ఉంటాయని రెడ్ మ్యాజిక్ వెల్లడించింది. ఈ ఫోన్కు సంబంధించిన రెడ్ మ్యాజిక్ సీఈవో ఇప్పటికే దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ స్మార్ట్ ఫోన్ పొడవుగా, బలంగా ఉండేలా డిజైన్ చేయబడిందని పేర్కొన్నారు. దీనిని ఒకసారి చేతిలో పట్టుకుంటే వదలటం కష్టమని ఆయన వెల్లడించారు. ఈ ఫోన్ను యువ గేమర్లను దృష్టిలో పెట్టుకొని రూపొందించినట్లు ఆయన వివరించారు. చేతిలో ఇముడు పోయేలా అత్యంత సౌకర్యవంతంగా ఉండడంతో ఎక్కువ సమయం పాటు పట్టుకుని గేమ్స్ ఆడుకునేందుకు దీంతో సులభంగా ఉంటుందని పేర్కొన్నారు. విభిన్నమైన ఫీచర్లు దీని సొంతం కావడంతో వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఈ ఫోన్ కు సంబంధించి సమాచారాన్ని పరిశీలిస్తే.. 6.8 అంగుళాల ఫుల్ HD + BOE OLED స్క్రీన్ ఉంటుంది. దీని రిఫ్రెష్ రేటు 120 Hz వరకు ఉండనుంది. ఈ ఫోన్లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్ ఉంటుంది. ఈ ఫోన్లో 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 50 ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉండనుంది. ఈ ఫోన్ పరిమాణం 164.3 x 76.6 x 7.85 mm ఉంటుంది. బరువు 25 గ్రాములు మాత్రమే ఉంటాయని చెబుతున్నారు. ఇది 6000 mAh భారీ బ్యాటరీ కలిగి ఉన్నా కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్న అత్యల్ప బరువు, అత్యల్ప మందం కలిగిన గేమింగ్ ఫోన్లో ఒకటిగా నిలుస్తుందని చెబుతున్నారు. అదేవిధంగా ఈ మొబైల్ కు 80 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. మొత్తంగా ఈ రెడ్ బుక్ 10 ఎయిర్ అత్యాధునిక ఫీచర్లు, స్టైలిష్ డిజైన్, పవర్ఫుల్ గేమింగ్ సామర్థ్యాలతో యూత్కు నచ్చేలా ఉండబోతుందని ఆ సంస్థ వెల్లడించింది. ఎప్పటికీ మార్కెట్లోకి విడుదలైన ఈ ఫోన్ భారీగా అమ్మకాలను సాగిస్తున్నట్లు ఆ సంస్థ నిర్వాహకులు చెబుతున్నారు.