నిద్రను ట్రాక్ చేసే స్మార్ట్ రింగ్.. ఇందులో ఉన్న ప్రత్యేకతలు ఏంటో తెలుసా.!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన చేతి వేలికి ఒక రింగును పెట్టుకున్నారు. కొద్దిరోజుల కిందట నిర్వహించిన ఒక సమావేశంలో ఆ రింగ్ ప్రత్యేకతను వివరించారు. ఏ రింగును చేతికి పెట్టుకుంటే నిద్ర గురించి తెలియజేస్తుందని వెల్లడించారు. తాను ఎంత సమయం పాటు పడుకున్నాను, పూర్తిస్థాయిలో పడుకున్నానో లేదో అన్న విషయాలను కూడా ఏ రింగు తెలియజేస్తుందని ఆయన వెల్లడించారు. అప్పట్నుంచి ఏ రింగు గురించి చాలామంది సెర్చ్ చేస్తున్నారు. అటువంటి రింగ్స్ ను ప్రత్యేకంగా చాలామంది కావాలని కోరుకుంటున్నారు. ఈ రింగ్స్ హెల్త్ ట్రాకర్లు గా ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. హెల్త్ ట్రాకర్ లో చాలావరకు అన్ని ఆభరణాల రూపాల్లోనూ వచ్చాయి. అనేక రకాల స్లీప్ ట్రాకర్లు కూడా మార్కెట్లో లభిస్తున్నాయి. వేలికి ధరించే ఈ ఔరా రింగ్ జెన్ 3 నిద్ర వ్యవధి, నాణ్యతను ట్రాక్ చేస్తుంది.

Smart Ring

స్మార్ట్ రింగ్

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన చేతి వేలికి ఒక రింగును పెట్టుకున్నారు. కొద్దిరోజుల కిందట నిర్వహించిన ఒక సమావేశంలో ఆ రింగ్ ప్రత్యేకతను వివరించారు. ఏ రింగును చేతికి పెట్టుకుంటే నిద్ర గురించి తెలియజేస్తుందని వెల్లడించారు. తాను ఎంత సమయం పాటు పడుకున్నాను, పూర్తిస్థాయిలో పడుకున్నానో లేదో అన్న విషయాలను కూడా ఏ రింగు తెలియజేస్తుందని ఆయన వెల్లడించారు. అప్పట్నుంచి ఏ రింగు గురించి చాలామంది సెర్చ్ చేస్తున్నారు. అటువంటి రింగ్స్ ను ప్రత్యేకంగా చాలామంది కావాలని కోరుకుంటున్నారు. ఈ రింగ్స్ హెల్త్ ట్రాకర్లు గా ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. హెల్త్ ట్రాకర్ లో చాలావరకు అన్ని ఆభరణాల రూపాల్లోనూ వచ్చాయి. అనేక రకాల స్లీప్ ట్రాకర్లు కూడా మార్కెట్లో లభిస్తున్నాయి. వేలికి ధరించే ఈ రింగ్ జెన్ 3 నిద్ర వ్యవధి, నాణ్యతను ట్రాక్ చేస్తుంది. వీటితోపాటు హృదయ స్పందన, శ్వాస విధానాలు, శరీర కదలకలను కూడా పర్యవేక్షించి స్లీప్ ఫిట్నెస్ స్కోరు ను ఇస్తుంది. మొబైల్కు అనుసంధానం చేసుకొని యాప్ సాయంతో ఉపయోగించుకోవచ్చు. దీని ధర ప్రస్తుత మార్కెట్లో రూ.21,414 గా ఉంది. ఇది ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకోవడంలో ఎంతగానో దోహదపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్నత వర్గాలకు చెందిన ప్రజలు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు ఎక్కువగా దీనిని వినియోగించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. నిద్రను మానిటరింగ్ చేయడంతో పాటు నిద్రలో ఉన్న ఇబ్బందులను గుర్తించి అప్రమత్తం చేస్తుంది. దీనివల్ల మరసటి రోజు అటువంటి ఇబ్బందులు లేకుండా నిద్రకు ఉపక్రమించేలా ఏర్పాటులు చేసుకునేందుకు ఈ రింగు దోహదం చేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. గడచిన కొన్నాలుగా ఈ రింగు కొనుగోలు భారీగా పెరుగుతున్నట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు. 

వచ్చేసాయి స్మార్ట్ పరుపులు..

ప్రస్తుతం మార్కెట్లో మంచి నిద్రకు ఉపయోగపడే స్మార్ట్ పరుపులు కూడా వచ్చాయి. సాధారణంగా మంచి నిద్ర పట్టాలంటే మంచి పరుపు కావాలి. మెత్తటి పరుపులు నిద్రకు అనుకూలంగా ఉంటాయి. కానీ ఇప్పుడు వచ్చిన ఈ స్మార్ట్ పరుపులు మిమ్మల్ని హాయిగా నిద్రపోయేలా చేస్తాయి. ఇవి నిద్ర అలవాట్లు, కదలికలను పర్యవేక్షించడానికి వీటిలో సెన్సార్లు ఉంటాయి. ఇవి ఎంత బాగా నిద్రపోతున్నారనే విషయాన్ని ట్రాక్ చేసి సమాచారాన్ని అందిస్తాయి. సౌకర్యవంతంగా ఉండడానికి శరీర ఉష్ణోగ్రతను అనుకూలంగా మార్చి హాయిగా నిద్రపోయేలా చేస్తాయి. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఈ స్మార్ట్ పరుపులకు కూడా మంచి డిమాండ్ ఉంది. భారీగా కొనుగోలు సాగుతున్నట్లు చెబుతున్నాయి.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్