నిరుపేద రోగులకు షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకుంది జాతీయ ఔషధ సాధికార సంస్థ. గత కొన్నాళ్లుగా కొన్ని రకాల వ్యాధులకు వినియోగిస్తున్న మందుల ధరలను పెంచుతూ ఈ సంస్థ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల నిరుపేద రోగులపై మరింత భారం పడనుంది. ఔషధాలకు సంబంధించి ధరల నియంత్రణ వ్యవహారాలను ఈ సంస్థ పర్యవేక్షిస్తూ ఉంటుంది. ఈ నిర్ణయం సాధారణ, మధ్య తరగతికి చెందిన నిరుపేదలకు ఆర్థికంగా మరింత ఇబ్బంది కలిగిస్తుందని పలువురు రోగులు కూడా వాపోతున్నారు.
మందులు
నిరుపేద రోగులకు షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకుంది జాతీయ ఔషధ సాధికార సంస్థ. గత కొన్నాళ్లుగా కొన్ని రకాల వ్యాధులకు వినియోగిస్తున్న మందుల ధరలను పెంచుతూ ఈ సంస్థ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల నిరుపేద రోగులపై మరింత భారం పడనుంది. ఔషధాలకు సంబంధించి ధరల నియంత్రణ వ్యవహారాలను ఈ సంస్థ పర్యవేక్షిస్తూ ఉంటుంది. కొన్ని సాంకేతిక అంశాలను పరిగణలోకి తీసుకొని కొన్ని ఔషధాల ధరలను పెంచినట్లు ఈ సంస్థ వెల్లడించింది. తాజాగా ఎనిమిది రకాల ఔషధాల ధరలను పెంచుతూ జాతీయ ఔషధ ధరల సాధికార సంస్థ నిర్ణయాన్ని వెలువరించింది. ధరలు పెంచిన ఔషధాలు జాబితాలో సాల్బుటమోల్ (ఆస్తమా చికిత్సలో ఉపయోగించే ఔషధం), స్క్రిప్టోమైసిన్ (యాంటీబయాటిక్, టీబీ వ్యాధిగ్రస్తులు వినియోగించే మందు), లిథియం (బైపోలార్ డిజార్డర్), ఫైలో కార్బిన్ కంటి చుక్కలు (గ్లకోమా), అట్రోఫీన్ ఇంజక్షన్ (యాంటీబయాటిక్), డిజ్ ఫెరాక్షమైన్ (తలసీమియా), సెఫడ్రోక్సిల్ (యాంటీబయాటిక్) ఉన్నాయి.
ప్రస్తుతం ఆయా మందులకు ఉన్న ధరలను పోల్చితే పెరిగిన ధరలు 50 శాతం వరకు అధికంగా ఉన్నాయి. పెంచిన ధరలు వెంటనే అమలులోకి వస్తాయని ఈ సంస్థ వెల్లడించింది. ఈ కీలక ఔషధాల ధరలను పెంచడం వలన నిరుపేద రోగులపై ఆర్థిక భారం పడుతుందని పలువురు పేర్కొంటున్నారు. తాజాగా పెంచిన ధరలకు సంబంధించిన మందులను పరిశీలిస్తే అధికంగా నిరుపేదలకు బాధపడే వ్యాధులకు సంబంధించిన మందులు ఉన్నట్లు చెబుతున్నారు. బైపోలార్ డిజార్డర్, ఆస్తమా, గ్లకోమా, తలసీమియా వంటి వ్యాధులతో బాధపడుతున్న వారిలో లక్షలాదిమంది నిరుపేద రోగులు ఉన్నారు. వీరంతా ఆయా మందులను వినియోగిస్తూ వ్యాధి నుంచి ఉపశమనం పొందుతున్నారు. తాజాగా జాతీయ ఔషధ ధరల సాధికార సంస్థ వీటి ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకోవడం వలన వీరిపై పెను భారం పడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. సాధారణ, మధ్య తరగతికి చెందిన నిరుపేదలకు ఈ నిర్ణయం ఆర్థికంగా మరింత ఇబ్బంది కలిగిస్తుందని పలువురు రోగులు కూడా వాపోతున్నారు.