మహిళల టి20 వరల్డ్ కప్ పోటీల్లో భారత మహిళల జట్టుకు షాక్ తగిలింది. వరల్డ్ కప్ లో ఆడిన తొలి మ్యాచ్ లోనే భారత జట్టు దారుణమైన పరాభవాన్ని మూటగట్టుకుంది. ఆరంభ మ్యాచ్ లో న్యూజిలాండ్ తో తలపడిన భారత మహిళల జట్టు అన్ని విభాగాల్లోనూ తడబాటుకు గురైంది. దీంతో తొలి మ్యాచ్ లో 55 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. తొలి మ్యాచ్లో దారుణమైన ఆట తీరుతో 58 పరుగులు తేడాతో చిత్తయి అభిమానుల ఆశలపై టీమిండియా జట్టు నీళ్లు చల్లింది. భారీ పరుగులు తేడాతో ఓటమిని చూడడంతో సెమీస్ అవకాశాలను కూడా సంక్లిష్టం చేసుకుంది.
విజయానందంలో న్యూజిలాండ్ జట్టు
మహిళల టి20 వరల్డ్ కప్ పోటీల్లో భారత మహిళల జట్టుకు షాక్ తగిలింది. వరల్డ్ కప్ లో ఆడిన తొలి మ్యాచ్ లోనే భారత జట్టు దారుణమైన పరాభవాన్ని మూటగట్టుకుంది. ఆరంభ మ్యాచ్ లో న్యూజిలాండ్ తో తలపడిన భారత మహిళల జట్టు అన్ని విభాగాల్లోనూ తడబాటుకు గురైంది. దీంతో తొలి మ్యాచ్ లో 55 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. టోర్నీలో ఫేవరెట్ జట్టుగా బరిలోకి దిగిన టీమిండియా ఈసారి ఎలాగైనా టైటిల్ ను దక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు అనుగుణంగానే బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బలమైన ఆటగాళ్లతో బరిలోకి దిగింది. అయితే తొలి మ్యాచ్లో దారుణమైన ఆట తీరుతో 58 పరుగులు తేడాతో చిత్తయి అభిమానుల ఆశలపై టీమిండియా జట్టు నీళ్లు చల్లింది. భారీ పరుగులు తేడాతో ఓటమిని చూడడంతో సెమీస్ అవకాశాలను కూడా సంక్లిష్టం చేసుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు అద్భుతమైన పోరాటాన్ని కనబరిచింది. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 160 పరుగులను చేసింది న్యూజిలాండ్ జట్టు. కెప్టెన్ సోఫీ డివైన్ 36 బంతుల్లో ఏడు ఫోర్లతో 57 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచింది. ఓపెనర్లు ప్లిమ్మర్ 23 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్స్ సహాయంతో 34 పరుగులు చేయగా, మరో ఓపెనర్ సుజి బేట్స్ 24 బంతుల్లో రెండు ఫోర్లు సహాయంతో 27 పరుగులు చేసి ఆకట్టుకుంది. భారత బౌలర్లలో రేణుక సింగ్ కు రెండు వికెట్లు దక్కాయి. లక్ష్య చేధనలో భారత్ 19 ఓవర్లలో 102 పరుగులకే కుప్ప కూలింది. సారథి హార్మన్ ప్రీత్ 15 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచింది. మిగిలిన ఆటగాళ్లు ఎవరూ ఆశించిన స్థాయిలో రాణించలేదు. న్యూజిలాండ్ పేసర్లు రోజ్ మేరీకు నాలుగు, తహు హుకు మూడు వికెట్లు లభించాయి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా సోఫీ డివైన్ నిలిచింది. స్లో పిచ్ పై భారీ లక్ష్యాన్ని చేదించేందుకు బరిలోకి దిగిన భారత జట్టు ఏ దశలోనూ లక్ష్యం వైపు సాగలేక పోయింది. పవర్ ప్లేలోనే సఫాలీ (2), స్మృతి మందాన (12), హర్మన్ ప్రీత్ వికెట్లను కోల్పోవడంతో భారత జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తరువాత కూడా వికెట్ల పతనం ఎక్కడ ఆగలేదు.
ఇన్నింగ్స్ తొలి బంతిని ఫోర్ కొట్టి మందాన ఆశలు రేపినా కివీసు బౌలర్లు సమిష్టిగా రాణించడంతో ఏ దశలోనూ భారత జట్టు కోలుకోలేకపోయింది. తొలిత బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు ఆటగాళ్లు మాత్రం దూకుడును ప్రదర్శించారు. ఓపెనర్ల జోరుకు సోఫీ డివైన్ బాదుడు జత కలవడంతో కివిస్ ఈ పిచ్ పై భారీ స్కోరు సాధించగలిగింది. దీనికి తోడు భారత ఫీల్డింగ్ వైఫల్యం కూడా ఆ జట్టుకు కలిసి వచ్చింది. తొలి ఓవర్ లోనే ఓపెనర్ బేట్స్ రెండు ఫోర్లతో సత్తా చాటింది. ఇక మూడో ఓవర్ లో మరో ఓపెనర్ ప్లిమ్మర్ నాలుగు ఫోర్లతో చెలరేగగా, స్పిన్నర్ దీప్తి 16 పరుగుల సమర్పించుకుంది. ఆరో ఓవర్ లోను ఆమె రెండు ఫోర్లు బాదడంతో పవర్ ప్లే లో జట్టు 55 పరుగులతో దూసుకెళ్లింది. అదే ఓవర్లో బేట్స్ క్యాచ్ ను పేపర్ రిచా వదిలేసింది. ఈ జోడి తొలి వికెట్ కు 67 పరుగులు జోడించిన తరువాత వరుస ఓవర్లలో పెవిలియన్ చేరింది. ఈ సంతోషాన్ని ఆవిరి చేస్తూ సోఫీ డివైన్ బ్యాట్ ఝులిపించడంతో కివీస్ ఆటలో ఎక్కడా వేగం తగ్గలేదు. అమేలి కేరీ (13) అవుట్ విషయంలో కాస్త హైడ్రామా నెలకొన్న ఆమె ఎక్కువ సేపు నిలవలేదు. సోఫీ మాత్రం వరుస పోర్లతో భారత బౌలర్లపై ఒత్తిడి పెంచింది. దీంతో 15 ఓవర్లలో స్కోరు 100 పరుగులు దాటింది. 18వ ఓవర్ లో బ్రూక్ హాలిడే (16) రెండు, డివైన్ మరో ఫోర్ తో 16 పరుగులు వచ్చాయి. ఆఖరి ఓవర్ లో డివైన్ చక్కటి ఫోర్ తో అర్థ సెంచరీ పూర్తి చేయడంతోపాటు స్కోరు 160కి చేర్చగలిగింది. టీమిండియా తొలి మ్యాచ్ లోనే భారీ పరుగులు తేడాతో ఓటమికి గురికావడంతో సెమిస్ ఆశలు క్లిష్టంగా మారనున్నాయి.